క్రీడాభూమి

భారత్ ‘ఎ’ ఇన్నింగ్స్ విజయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (స్పోర్ట్స్), సెప్టెంబర్ 25: న్యూజిలాండ్ ‘ఎ’తో జరిగిన అనధికార టెస్టును భారత్ ‘ఎ’ జట్టు ఇన్నింగ్స్ 312 పరుగుల భారీ తేడాతో గెల్చుకుంది. షాబాజ్ నదీం, కర్న్‌శర్మ ఒక్కో ఇన్నింగ్స్‌లో నాలుగేసి చొప్పున, చెరి ఎనిమిది వికెట్లు పడగొట్టి భారత్‌కు తిరుగులేని విజయాన్ని అందించాడు. రెండో ఇన్నింగ్స్‌లోనూ విఫలమైన కివీస్ ‘ఎ’ జట్టు 142 పరుగులకు కుప్పకూలింది. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో ఆ జట్టు 147 పరుగులకు ఆలౌట్‌కాగా, జార్జి వర్కర్ (33), జీత్ రావెల్ (34), టిమ్ సీఫెర్ట్ (35 నాటౌట్) మాత్రమే కొంత వరకు భారత్ బౌలింగ్‌ను ఎదుర్కోగలిగారు. నదీం 38 పరుగులకు నాలుగు, కర్న్ శర్మ 58 పరుగులకు నాలుగు చొప్పున వికెట్లు కూల్చారు. అనంతరం బ్యాటింగ్ చేసిన భారత్ ‘ఎ’ 320 పరుగులు సాధించింది. శ్రేయాస్ అయ్యర్ (108) సెంచరీ చేయగా, రవి కుమార్ సామ్రాట్ (54), రిషభ్ పటేల్ (67) అర్ధ శతకాలు నమోదు చేశారు. కాగా, మొదటి ఇన్నింగ్స్‌లో 173 పరుగులు వెనుకంజలో ఉన్న న్యూజిలాండ్ ‘ఎ’ రెండో ఇన్నింగ్స్‌లోనూ విఫలమైంది. ఓపెనర్ జార్జి ఓర్కర్ 35 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడంటే, మిగతా బ్యాట్స్‌మెన్ వైఫల్యం ఏ స్థాయిలో కొనసాగిందో ఊహించుకోచ్చు. నదీం 51 పరుగులకు నాలుగు వికెట్లు కూల్చాడు. కర్న్ శర్మ 62 పరుగులకు నాలుగు వికెట్లు సాధించాడు. అన్ని విభాగాల్లోనూ ఆధిపత్యాన్ని కనబరచి, నాలుగు రోజుల మ్యాచ్‌ని మూడు రోజుల్లోనే ముగించింది. ఈ అనధికార టెస్టు సిరీస్‌లో చివరిదైన రెండో మ్యాచ్ ఈనెల 30 నుంచి అక్టోబర్ 3వ తేదీ వరకు జరుగుతుంది. ఆతర్వాత ఇరు జట్ల మధ్య ఐదు అనధికార వనే్డ మ్యాచ్‌లు ఉంటాయి.
సంక్షిప్త స్కోర్లు
న్యూజిలాండ్ ‘ఎ’ తొలి ఇన్నింగ్స్: 63 ఓవర్లలో 147 ఆలౌట్ (జార్జి వర్కర్ 33, జీత్ రావల్ 34, టిమ్ సీఫెర్ట్ 35 నాటౌట్, కర్న్ శర్మ 4/58, షాబాజ్ నదీం 4/39).
భారత్ ‘ఎ’ తొలి ఇన్నింగ్స్: 67.2 ఓవర్లలో 320 ఆలౌట్ (రవి కుమార్ సామ్రాట్ 54, శ్రేయాస్ అయ్యర్ 108, రిషభ్ పంత్ 67, ఇష్ సోధీ 5/94, టాడ్ ఆస్లే 2/55).
న్యూజిలాండ్ ‘ఎ’ రెండో ఇన్నింగ్స్: 63.1 ఓవర్లలో 142 ఆలౌట్ (జార్జి వర్కర్ 35, జీత్ రావల్ 21, షాబాజ్ నదీం 4/51, కర్న్ శర్మ 4/62).

చిత్రం..ఎనిమిది వికెట్లు పడగొట్టి, న్యూజిలాండ్ ‘ఎ’పై భారత్ ‘ఎ’ విజయంలో ప్రధాన భూమిక పోషించిన షాబాజ్ నదీం