క్రీడాభూమి

సింధుకు పద్మ భూషణ్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 25: భారత బాడ్మింటన్ స్టార్, తెలుగు తేజం పివి సింధు పేరును పద్మ భూషణ్ అవార్డు కోసం కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ప్రతిపాదించింది. దేశంలోనే మూడో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ భూషణ్‌కు ఆమె పేరుతో ప్రతిపాదన పంపామని క్రీడా మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు పిటిఐతో మాట్లాడుతూ చెప్పాడు. ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో రెండు పర్యాయాలు కాంస్య పతకాలు సాధించిన సింధు గత ఏడాది రియో ఒలింపిక్స్‌లో రజత పతకాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఒలింపిక్స్‌లో రన్నరప్‌గా నిలిచిన తొలి భారత బాడ్మిండన్ క్రీడాకారిణిగా ఆమె చరిత్ర పుటల్లో చోటు సంపాదించింది. హైదరాబాద్‌కు చెందిన ఈ 22 ఏళ్ల యువ సుంచలనం నిరుడు చైనా ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్, ఇండియన్ ఓపెన్ సూపర్ సిరీస్ టైటిళ్లను సాధించింది. గత నెల గ్లాస్గోలో జరిగిన ప్రపంచ బాడ్మింటన్ చాంపియన్‌షిప్స్‌లో రజత పతకాన్ని కైవసం చేసుకుంది. ఈనెల ఆమె కొరియా ఓపెన్ సూపర్ సిరీస్‌లో విజేతగా నిలిచింది. మకావూ ఓపెన్‌లో మూడు పర్యాయాలు చాంపియన్‌షిప్‌ను సాధించిన సింధు ఈ ఏడాది లక్నోలో సయ్యద్ మోదీ గ్రాండ్ ప్రీ గోల్డ్‌లోనూ టైటిల్‌ను అందుకుంది. అద్భుత ప్రతిభాపాటవాలు కనబరుస్తున్న సింధు తన కెరీర్‌లో అత్యుత్తమంగా ప్రపంచ ర్యాంకింగ్స్‌లో రెండో స్థానాన్ని చేరింది. ఆతర్వాత ఆ స్థానాన్ని కోల్పోయినా, గత వారం తిరిగి నంబర్ టూగా ఎదిగింది. 2014లో కామనె్వల్త్ గేమ్స్‌లో కాంస్య పతకాన్ని గెల్చుకున్న ఆమె ఇంచియాన్ ఆసియా క్రీడల్లోనూ మూడో స్థానాన్ని దక్కించుకుంది. 2015 మార్చిలో ఆమెకు భారత నాలుగో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మశ్రీ అవార్డు లభించింది.
తన పేరును పద్మ భూషణ్ అవార్డుకు ప్రతిపాదించిన కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖకు సింధు కృతజ్ఞతలు తెలిపింది. ఈ సమాచారం విని తాను ఎంతో ఆనందించానని హైదరాబాద్ నుంచి విడుదల చేసిన ఒక ప్రకటనలో ఆమె పేర్కొంది.

చిత్రం..పివి సింధు