క్రీడాభూమి

సెంచరీ భాగస్వామ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారత ఓపెనర్లు అజింక్య రహానే, రోహిత్ శర్మ మొదటి వికెట్‌కు సెంచరీ భాగస్వామ్యాన్ని నమోదు చేయడంతో ఆసీస్‌కు భారత్ దీటైన సమాధానమిచ్చే స్థితిలో నిలిచింది. జట్టు స్కోరు 106 పరుగుల వద్ద ఆరోన్ ఫించ్ క్యాచ్ అందుకోగా కేన్ రిచర్డ్‌సన్ బౌలింగ్‌లో అవుటైన రహానే 66 బంతుల్లో 53 పరుగులు చేశాడు. అతని స్కోరులో ఆరు ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి. తర్వాత కొద్ది సేపటికే రోహిత్ కూడా వెనుదిరిగాడు. 55 బంతుల్లో, ఒక ఫోర్, ఐదు సిక్సర్లతో 65 పరుగులు చేసిన అతను దురదృష్టవశాత్తు రనౌటయ్యాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీ 21 పరుగులకు వెనుదిరగ్గా, జట్టును లక్ష్యానికి చేర్చే ప్రయత్నంలో వేగంగా పరుగులు రాబట్టిన హార్దిక్ పాండ్య వికెట్ 225 పరుగుల వద్ద కూలింది. అతను 40 బంతులు ఎదుర్కొని, ఒక ఫోర్, మూడు సిక్సర్లతో 41 పరుగులు చేసి, ఆడం జంపా బౌలింగ్‌లో డేవిడ్ వార్నర్‌కు దొరికాడు. కేదార్ జాధవ్ కూడా రన్‌రేట్‌ను పెంచేందుకు విశేషంగా శ్రమించాడు. అతను 69 బంతుల్లో, ఏడు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 67 పరుగులు చేసి, కేన్ రిచర్డ్‌సన్ బౌలింగ్‌లో ఆరోన్ ఫించ్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. మనీష్ పాండే 25 బంతుల్లోనే 33 పరుగులు చేసి, పాట్ కమిన్స్ బౌలింగ్‌లో బంతిని అర్థం చేసుకోలేక క్లీన్ బౌల్డ్ అయ్యాడు. మాజీ కెప్టెన్ ధోనీ 13 పరుగులకే వెనుదిరిగాడు. అతనిని కేన్ రిచర్డ్‌సన్ క్లీన్ బౌల్డ్ చేశాడు. అప్పటికి జట్టు స్కోరు 301 పరుగులు. అక్షర్ పటేల్, మహమ్మద్ షమీ క్రీజ్‌లో ఉన్నప్పుడు, భారత్ విజయానికి 29 పరుగుల దూరంలో నిలిచింది. నాథన్ కౌల్టర్ నైల్ వేసిన చివరి ఓవర్ మొదటి బంతికే సబ్‌స్టిట్యూట్ ఆటగాడు గ్లేన్ మాక్స్‌వెల్ క్యాచ్ పట్టగా అక్షర్ పటేల్ (5) పెవిలియన్ చేరాడు. మొత్తం మీద భారత్ 50 ఓవర్లలో 8 వికెట్లకు 313 పరుగులు చేసింది. అప్పటికి షమీ 6, ఉమేష్ యాదవ్ 2 పరుగులతో నాటట్‌గా ఉన్నారు. ఆసీస్ బౌలర్లలో కేన్ రిచర్డ్‌సన్ 58 పరుగులకు మూడు, నాథన్ కౌల్టర్ నైల్ 56 పరుగులిచ్చి రెండు చొప్పున వికెట్లు కూల్చారు.

చిత్రం..ఆరోన్ ఫించ్‌ను 94 పరుగుల వద్ద ఔట్ చేసిన
భారత పేసర్ ఉమేష్ యాదవ్‌కు సహచరుడు రోహిత్ శర్మ అభినందన