క్రీడాభూమి

వార్నర్ సూపర్ సెంచరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, సెప్టెంబర్ 28: భారత్ చేతిలో ఐదు మ్యాచ్‌ల వనే్డ సిరీస్‌ను ఇప్పటికే 0-3 తేడాతో కోల్పోయిన ఆస్ట్రేలియా ఇక్కడి చిన్నస్వామి స్టేడియంలో జరిగిన నాలుగో వనే్డను 21 పరుగుల తేడాతో గెల్చుకొని, భారత్ ఆధిక్యాన్ని తగ్గించింది. సిరీస్ ఫలితంపై ఎలాంటి ప్రభావం చూపకపోయినా, రానున్న యాషెస్ సిరీస్‌కు సిద్ధమయ్యేందుకు అవసరమైన ఆత్మవిశ్వాసాన్ని ఆసీస్ సంపాదించుకుంది. కెరీర్‌లో వందో వనే్డ ఇంటర్నేషనల్ ఆడిన ఓపెనర్ డేవిడ్ వార్నర్ అద్భుత శతకంతో కదం తొక్కగా, మరో ఓపెనర్ ఆరోన్ ఫించ్ ఆరు పరుగుల తేడాతో సెంచరీని చేజార్చుకున్నప్పటికీ, ఆస్ట్రేలియా 50 ఓవర్లలో 5 వికెట్లకు 334 పరుగుల భారీ స్కోరును సాధించేందుకు సహకరించాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 313 పరుగులు చేయగలిగింది.
టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకోవడంలో ఎలాంటి పొరపాటు లేదని ఓపెనర్లు డేవిడ్ వార్నర్, ఆరోన్ ఫించ్ రుజువు చేశారు. భారత బౌలింగ్‌ను ఏమాత్రం లక్ష్యపెట్టకుండా వీరిద్దరూ పరుగుల వరద పారించారు. లూజ్ బంతులను ఎంత బలంగా బాదారో, సరైన దిశలో వచ్చిన బంతులను అంతగా ఆచితూచి ఆడిన వీరి వ్యూహాత్మక బ్యాటింగ్ ఆసీస్ ఇన్నింగ్స్‌ను బలమైన పునాది వేసింది. మొదటి వికెట్‌కు 35 ఓవర్లలో 231 పరుగులు జత కలిసిన తర్వాత వార్నర్ వికెట్ కూలింది. రెగ్యులర్ బౌలర్లను ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆడుతున్న వార్నర్, ఫించ్ దూకుడుకు బ్రేక్ వేయాలన్న ఉద్దేశంతో పార్ట్‌టైమర్ కేదార్ జాధవ్‌ను తీసుకొచ్చిన కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రయోగం ఫలించింది. 119 బంతులు ఎదుర్కొని, 12 ఫోర్లు, 4 సిక్సర్లతో 124 పరుగులు చేసిన వార్నర్ ఎలాంటి అంచనాలకూ వీలు చిక్కని జాధవ్ బౌలింగ్‌లో షాట్‌కు ప్రయత్నించి, అక్షర్ పటేల్ క్యాచ్ పట్టగా పెవిలియన్ చేరాడు. అదే స్కోరువద్ద ఆస్ట్రేలియా రెండో వికెట్ కూడా కోల్పోయింది. 96 బంతుల్లో 94 పరుగులు చేసిన ఆరోన్ ఫించ్‌ని హార్దిక్ పాండ్య క్యాచ్ అందుకోగా, ఉమేష్ యాదవ్ అవుట్ చేశాడు. సెంచరీని ఆరు పరుగుల తేడాతో చేజార్చుకున్న ఫించ్ స్కోరులో 10 ఫోర్లు, మూడు సిక్సర్లు ఉన్నాయి. కెప్టెన్ స్టీవెన్ స్మిత్ కేవలం మూడు పరుగులకే, ఉమేష్ యాదవ్ బౌలింగ్‌లో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీకి దొరికిపోయాడు. ట్రాస్ హెడ్ 38 బంతుల్లో 29 పరుగులు చేసి ఉమేష్ యాదవ్ బౌలింగ్‌లోనే అజింక్య రహానే క్యాచ్ పట్టగా వెనుదిరిగాడు. వేగంగా పరుగులను రాబట్టడానికి ప్రయత్నించిన పీటర్ హ్యాండ్స్‌కోమ్ 30 బంతుల్లో 43 పరుగులు చేసి, ఉమేష్ యాదవ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. చివరిలో మార్కస్ స్టొయినిస్ (15 నాటౌట్), మాథ్యూ వేడ్ (3 నాటౌట్) క్రీజ్‌లో నిలవగా, ఆస్ట్రేలియా 50 ఓవర్లలో 334 పరుగులు సాధించింది. భారత బౌలర్లలో ఉమేష్ యాదవ్ 71 పరుగులకు నాలుగు వికెట్లు పడగొట్టాడు.

* కెరీర్‌లో ఆడిన వందో వనే్డలో సెంచరీ సాధించిన ఎనిమిదో బ్యాట్స్‌మన్‌గా డేవిడ్ వార్నర్ రికార్డు పుస్తకాల్లోకి ఎక్కాడు. ఆస్ట్రేలియా తరఫున ఈ ఫీట్ అతనికి మాత్రమే సాధ్యమైంది. గత
విరాట్ కోహ్లీ నాయకత్వంలో టీమిండియా వరుస విజయాలకు ఆస్ట్రేలియా బ్రేక్ వేసింది. గురువారం జరిగిన నాలుగో వనే్డను 21 పరుగుల తేడాతో గెల్చుకుంది. ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో తొలిసారి భారత్‌పై విజయాన్ని నమోదు చేయడంలో ఆసీస్ ఓపెనర్లు డేవిడ్ వార్నర్, ఆరోన్ ఫించ్ కీలక పాత్ర పోషించారు. భారత బౌలింగ్ బలహీనంగా ఉందనే విషయం మరోసారి స్పష్టంకాగా, పటిష్టమైన బ్యాటింగ్ లైనప్ ఉన్నప్పటికీ, 335 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక పోవడం అభిమానులను నిరాశ పరచింది. శ్రీలంకకు వైట్‌వాష్ వేసిన రీతిలోనే ఆస్ట్రేలియాను 5-0 తేడాతో చిత్తు చేయాలన్న భారత్ ఆశలకు చిన్నస్వామి స్టేడియంలో గండిపడింది. వరుస పరాజయాలతో అల్లాడుతున్న ఆసీస్ ఈ విజయంలో మళ్లీ ఆత్మవిశ్వాసాన్ని సంపాదించుకుంది.పదేళ్లుగా ఎవరూ నమోదు చేయలేకపోయిన ‘సెంచరీ వనే్డ’లో సెంచరీని వార్నర్ సుసాధ్యం చేశాడు.
* వంద వనే్డల్లో వార్నర్ మొత్తం 4,217 పరుగులు సాధించాడు. ఈ మైలురాయిని చేరుకునే సమయానికి ఎక్కువ పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్ జాబితాలో అతను రెండో స్థానాన్ని దక్కించుకున్నాడు. దక్షిణాఫ్రికా ఆటగాడు హషీం ఆమ్లా వంద వనే్డల్లో 4,808 పరుగులు చేసి అగ్రస్థానాన్ని ఆక్రమించగా, గార్డెన్ గ్రీనిడ్జ్ 4,177 పరుగులతో మూడో స్థానంలో ఉన్నాడు. వివియన్ రిచర్డ్స్ 4,146, విరాట్ కోహ్లీ 4,107 చొప్పున పరుగులు చేసి, వరుసగా నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచారు.
* బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో అత్యధిక భాగస్వామ్యాన్ని డేవిడ్ వార్నర్, ఆరోన్ ఫించ్ నమోదు చేశారు. 2011 వరల్డ్ కప్‌లో భాగంగా కెనడాతో జరిగిన ఆస్ట్రేలియాకే చెందిన షేన్ వాట్సన్, మాథ్యూ హాడిన్ 183 పరుగుల పార్ట్‌నర్‌షిప్‌ను సాధించగా, ఆ రికార్డును 231 పరుగులతో వార్నర్, ఫించ్ బద్దలు చేశారు.

చిత్రాలు..డేవిడ్ వార్నర్, ఆరోన్ ఫించ్