క్రీడాభూమి

హోం గ్రౌండ్‌లో తలైవాస్ విఫలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, సెప్టెంబర్ 29: ప్రో కబడ్డీ లీగ్‌లో తమిళ్ తలైవాస్ జట్టు హోం గ్రౌండ్‌లోనే పరాజయాన్ని చవిచూసింది. అన్ని విభాగాల్లోనూ విఫలమైన ఆ జట్టు పునేరీ పల్టన్ చేతిలో 13 పాయింట్ల తేడాతో ఓడింది. దీపక్ హూడా ఆరు, రాజేష్ మోండల్ ఐదు, మోనూ 4 చొప్పున పాయింట్లతో రాణించడంతో పునేరీ పల్టన్ 33 పాయింట్లకు చేరుకోగలిగింది. తలైవాస్ తరఫున అజయ్ ఠాకూర్, సబ్‌స్టిట్యూట్ ఆటగాడు డాంగ్ లీ చెరి నాలుగు పాయింట్లు చేశారు. మిగతా వారు ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో తలైవాస్‌కు ఓటమి తప్పలేదు.