క్రీడాభూమి

బీజింగ్ ఓపెన్‌కు సఫరోవా దూరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీజింగ్, సెప్టెంబర్ 29: మహిళల డబుల్స్ విభాగంలో నంబర్ వన్ ర్యాంక్‌లో ఉన్న లూసీ సఫరోవా శనివారం నుంచి మొదలయ్యే బీజింగ్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్‌లో పాల్గొనడం లేదు. చేతి మణికట్టుకు గాయమైందని, అందుకే, బీజింగ్ ఓపెన్‌కు హాజరుకాలేకపోతున్నానని ప్రేగ్‌లో విడుదల చేసిన ఒక ప్రకటనలో సఫరోవా తెలిపింది. సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో 29వ స్థానంలో ఉన్న 30 ఏళ్ల ఈ చెక్ రిపబ్లిక్ క్రీడాకారిణి త్వరలోనే కోలుకుంటానని ధీమా వ్యక్తం చేసింది. ప్రస్తుతం గాయం పూర్తిగా తగ్గలేదని, అది తిరగబెట్టే ప్రమాదం ఉన్నందున బీజింగ్ టోర్నీ నుంచి వైదొలగుతున్ననని తెలిపింది.