క్రీడాభూమి

సాకర్ కెరీర్‌కు డోల్ గుడ్‌బై

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పారిస్, సెప్టెంబర్ 29: ఐర్లాండ్ మాజీ స్ట్రయికర్, కెవిన్ డోల్ అంతర్జాతీయ కెరీర్‌కు గుడ్‌బై చెప్పాడు. 34 ఏళ్ల డోల్ ఫుట్‌బాలర్‌గా తన 16 ఏళ్ల కెరీర్‌లో ఐర్లాండ్‌కు ప్రాతినిథ్యం వహించాడు. క్లబ్ టోర్నీల్లో రీడింగ్, ఊల్వ్స్, క్రిస్టల్ ప్యాలెస్ తదిర జట్లకు ప్రాతినిథ్యం వహించాడు. ప్రస్తుతం అమెరికాలో కోలరాడో ర్యాపిడ్స్‌కు సేవలు అందిస్తున్నాడు. కెరీర్‌లో ఇంత వరకూ వివిధ స్థాయిల్లో మొత్తం 490 మ్యాచ్‌లు ఆడిన డోల్ 128 గోల్స్ సాధించాడు. ఇటీవల కాలంలో తాను ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నానని డోల్ ఒక ప్రకటనలో తెలిపాడు. ఎప్పుడు స్పృహ కోల్పోతానో తెలియని పరిస్థితి నెలకొందని, అందుకే, వైద్యుల సూచన మేరకు ఫుట్‌బాల్ నుంచి వైదొలగుతున్నానని వివరించాడు. కెరీర్ సంతృప్తికరంగా కొనసాగిందని తెలిపాడు.