క్రీడాభూమి

ధోనీ బ్యాటింగ్ ఆర్డర్‌పై చర్చ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, సెప్టెంబర్ 29: భారత మహిళా క్రికెట్ జట్టుకు చెందిన కొంత మంది క్రీడాకారిణులను కలిసి, వారితో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ముచ్చటిస్తున్న ఫొటోలను బిసిసిఐ సోషల్ మీడియాలో ఉంచింది. గురువారం చిన్నస్వామి స్టేడియంలో ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో వనే్డలో కోహ్లీ బృందం 21 పరుగులతో పరాజయాన్ని ఎదుర్కొన్న తర్వాత విమర్శలు వెల్లువెత్తుతాయేమోనన్న భయంతో బిసిసిఐ ఈ ఫొటోను అప్‌లోడ్ చేసి ఉండవచ్చు. కానీ, అభిమానులు మాత్రం ఈ ఫొటోను అంతగా పట్టించుకోలేదు. ఎక్కువ మంది అభిమానులు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ బ్యాటింగ్ ఆర్డర్‌పై విమర్శలు గుప్పించారు. అతి తక్కువ మంది కోహ్లీ నిర్ణయాన్ని సమర్థిస్తే, అధిక శాతం మంది ఇప్పటికీ ధోనీని మ్యాచ్ ఫినిషర్‌గా పేర్కోవడం, అతనిని అత్యంత కీలకమైన ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు పంపడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను అప్పటికే 3-0 తేడాతో కైవసం చేసుకున్న నేపథ్యంలో, ఆరో స్థానాన్ని భర్తీ చేసే బ్యాట్స్‌మన్‌పై ప్రయోగాలు చేయాల్సిన అవసరం ఉందన్న వాదన బలంగా వినిపిస్తున్నది. అయితే, చాలా తక్కువ మంది ధోనీ బ్యాటింగ్ ఆర్డర్‌ను మార్చాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు. అతనిని 11వ స్థానంలో బ్యాటింగ్‌కు పంపాలా? అంటూ ఎద్దేవా చేశారు. మొత్తం మీద మహిళా క్రికెట్‌ను కోహ్లీ ప్రోత్సహిస్తున్నాడన్న సంకేతాన్నిచ్చేందుకు ఫోస్ట్ చేసిన ఫొటోపై స్పందన రాకపోగా, కామెంట్లన్నీ ధోనీ బ్యాటింగ్ ఆర్డర్ చుట్టూ తిరగడంతో బిసిసిఐ కంగుతిని ఉంటుంది.