క్రీడాభూమి

న్యూజిలాండ్ ‘ఎ’ ఎదురీత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (స్పోర్ట్స్), అక్టోబర్ 2: భారత్ ‘ఎ’తో జరుగుతున్న నాలుగు రోజుల రెండో అనధికార టెస్టులో న్యూజిలాండ్ ‘ఎ’ ఎదురీదుతున్నది. మ్యాచ్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఒక వికెట్ కోల్పోయి 104 పరుగులు చేసింది. భారత్ ‘ఎ’ కంటే ఇంకా 132 పరుగులు వెనుకంజలో నిలిచిన ఈ జట్టు చేతిలో తొమ్మిది వికెట్లు ఉన్నాయి. చివరి రోజు ఆటలో భారత్ ‘ఎ’ బౌలింగ్‌ను కివీస్ ‘ఎ’ ఏ విధంగా ఎదుర్కొంటుందో చూడాలి. నాలుగు వికెట్లకు 360 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో మూడోరోజు ఆటను కొనసాగించిన భారత్ 110 ఓవర్లలో 447 పరుగులకు ఆలౌటైంది. సెంచరీ హీరో అంకిత్ బావ్నే 162 పరుగులతో నాటౌట్‌గా నిలవడం విశేషం. కాగా, మొదటి ఇన్నింగ్స్‌లో 236 పరుగులు వెనకబడిన న్యూజిలాండ్ ‘ఎ’ రెండో ఇన్నింగ్స్ ప్రారంభించి, ఆరంభంలోనే జార్జి వర్కర్ వికెట్‌ను కోల్పోయింది. ఆరు పరుగులు చేసిన అతనిని షాబాద్ నదీం ఎల్‌బిగా అవుట్ చేశాడు. ఫస్ట్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగిన హెన్రీ నికోల్స్ (55 నాటౌట్)తో కలిసి జాగ్రత్తగా ఆడిన ఓపెనర్ జీత్ రావల్ (41 నాటౌట్) మరో వికెట్ కూలకుండా జాగ్రత్త పడ్డాడు.
సంక్షిప్త స్కోర్లు
న్యూజిలాండ్ ‘ఎ’ తొలి ఇన్నింగ్స్: 69.5 ఓవర్లలో ఆలౌట్ 211 (జీత్ రావల్ 48, కొలిన్ మున్రో 65, టిమ్ సీఫెర్ట్ 44 నాటౌట్, షార్దూల్ ఠాకూర్ 3/34, కర్న్ శర్మ 3/49, షాబాద్ నదీం 2/41).
భారత్ ‘ఎ’ మొదటి ఇన్నింగ్స్ (ఓవర్‌నైట్ స్కోరు 4/36): 110 ఓవర్లలో 447 ఆలౌట్ (అంకిత్ బావ్నే 162 నాటౌట్, పార్థీవ్ పటేల్ 65, శ్రేయాస్ అయ్యర్ 82, ప్రియాంక్ పాంచాల్ 46, ఇష్ సోధీ 3/120, సేథ్ రాన్స్ 2/28, స్కాట్ క్లిగెలెజిన్ 2/82, కొలిన్ మున్రో 2/24).
న్యూజిలాండ్ ‘ఎ’ రెండో ఇన్నింగ్స్: 40 ఓవర్లలో వికెట్ నష్టానికి 104 (రావల్ 41 నాటౌట్, హెన్రీ నికోల్స్ 55 నాటౌట్).