క్రీడాభూమి

హెరాత్ స్పిన్ మాయ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అబూదబీ, అక్టోబర్ 2: రంగన హెరాత్ స్పిన్ మాయ పాకిస్తాన్‌తో జరిగిన మొదటి టెస్టులో శ్రీలంకకు 21 పరుగుల తేడాతో సంచలన విజయాన్ని అందించింది. తొలి ఇన్నింగ్స్‌లో ఐదు, రెండో ఇన్నింగ్స్‌లో ఆరు చొప్పున మొత్తం 11 వికెట్లు పడగొట్టిన హెరాత్ టెస్టుల్లో 400 వికెట్ల బౌలర్ల జాబితాలో చేరడం విశేషం. ఈ టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో శ్రీలంక 154.5 ఓవర్లలో 419 పరుగుల భారీ స్కోరు సాధించింది. దిమిత్ కరుణరత్నే 93, కెప్టెన్ దినేష్ చండీమల్ 155, నిరోషన్ డిక్‌విల్లా 83 చొప్పున పరుగులు చేశాడు. మహమ్మద్ అబ్బాస్ 75 పరుగులకు మూడు, యాసిర్ షా 120 పరుగులకు మూడు చొప్పున వికెట్లు కూల్చారు. హసన్ అలీకి రెండు వికెట్లు లభించాయి. లంక భారీ స్కోరుకు దీటైన సమాధానమిచ్చిన పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్‌లో 162.3 ఓవర్లలో 422 పరుగులు చేసింది. షాన్ మసూద్ (59), సమీ అస్లం (51), అజర్ అలీ (85), హారిస్ సొహైల్ (76) అర్ధ శతకాలను నమోదు చేశారు. రంగన హెరాత్ 92 పరుగులకు ఐదు వికెట్లు పడగొట్టగా, సురంగ లక్మల్, నువాన్ ప్రదీప్ చెరి రెండు వికెట్లు సాధించారు.
మొదటి ఇన్నింగ్స్‌లో మూడు పరుగులు వెనుకంజలో ఉన్న శ్రీలంక రెండో ఇన్నింగ్స్‌లో దారుణంగా విఫలమైంది. 66.5 ఓవర్లలో కేవలం 138 పరుగులకే కుప్పకూలింది. నిరోషన్ డిక్‌విల్లా అజేయంగా 40, కుశాల్ సిల్వ 25 పరుగులు చేశారు. యాసిర్ షా 51 పరుగులిచ్చి ఐదు వికెట్లు సాధించగా, మహమ్మద్ అబ్బాస్ 22 పరుగులకు రెండు వికెట్లు పడగొట్టాడు.
కేవలం 136 పరుగుల విజయ లక్ష్యాన్ని ఛేదించడానికి రెండో ఇన్నింగ్స్‌ను మొదలుపెట్టిన పాకిస్తాన్ ఆరంభం నుంచే క్రమం తప్పకుండా వికెట్లు చేజార్చుకుంది. దీనితో 47.4 ఓవర్లలో 114 పరుగులకే ఆలౌటైంది. హారిస్ సొహైల్ 34 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అతనితోపాటు అసద్ షఫీక్ (20), కెప్టెన్ సర్ఫ్‌రాజ్ అహ్మద్ (19) మాత్రమే రెండంకెల స్కోరు చేయగలిగారు. రంగన హెరాత్ 43 పరుగులిచ్చి ఆరు వికెట్లు కూల్చి, లంక విజయానికి బాటలు వేశాడు. దిల్‌రువాన్ పెరెరా 45 పరుగులకు మూడు వికెట్లు సాధించాడు.

సంక్షిప్త స్కోర్లు
శ్రీలంక తొలి ఇన్నింగ్స్: 145.5 ఓవర్లలో 419 ఆలౌట్ (దిమిత్ కరుణరత్నే 93, దినేష్ చండీమల్ 155, నిరోషన్ డిక్‌విల్లా 83, మహమ్మద్ అబ్బాస్ 3/75, యాసిర్ షా 3/120, హసన్ అలీ 2/88).
పాకిస్తాన్ మొదటి ఇన్నింగ్స్: 162.3 ఓవర్లలో 422 ఆలౌట్ (షాన్ మసూద్ 59, షమీ అస్లం 51, అజర్ అలీ 85, హారిస్ సొహైల్ 76, రంగన హెరాత్ 5/92, సురంగ లక్మల్ 2/42, నువాన్ ప్రదీప్ 2/77).
శ్రీలంక రెండో ఇన్నింగ్స్: 66.5 ఓవర్లలో 138 ఆలౌట్ (నిరోషన్ డిక్‌విల్లా 40 నాటౌట్, కుశాల్ సిల్వ 25, యాసిర్ షా 5/51, మహమ్మద్ అబ్బాస్ 2/22).
పాకిస్తాన్ రెండో ఇన్నింగ్స్: 47.4 ఓవర్లలో 114 ఆలౌట్ (హారిస్ సొహైల్ 34, అసద్ షఫీక్ 20, సర్ఫ్‌రాజ్ అహ్మద్ 19, రంగన హెరాత్ 6/43, దిల్‌రువాన్ పెరెరా 3/45).

చిత్రం..రంగన హెరాత్