క్రీడాభూమి

దక్షిణాఫ్రికా చేతిలో బంగ్లా చిత్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పోచెఫ్‌స్ట్రూమ్, అక్టోబర్ 2: దక్షిణాఫ్రికాతో జరిగిన మొదటి టెస్టు మ్యాచ్‌లో బంగ్లాదేశ్ ఏకంగా 333 పరుగుల తేడాతో చిత్తయింది. దక్షిణాఫ్రికా బౌలర్ కేశవ్ మహారాజ్ మొదటి ఇన్నింగ్స్‌లో మూడు, రెండో ఇన్నింగ్స్‌లో నాలుగు చొప్పున వికెట్లు పడగొట్టి, తన జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. తొలుత బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా తన తొలి ఇన్నింగ్స్‌ను 148 ఓవర్లలో మూడు వికెట్లకు 496 పరుగుల భారీ స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. డీన్ ఎల్గార్ 199, అయిడెన్ మార్‌క్రామ్ 97, షహీం ఆమ్లా 137 చొప్పున పరుగులు సాధించారు. అనంతరం బంగ్లాదేశ్ మొదటి ఇన్నింగ్స్‌లో 89.1 ఓవర్లలో 320 పరుగులకు ఆలౌటైంది. మహమ్మద్ హక్ (77), మహమ్మదుల్లా (66) అర్ధ శతకాలతో రాణించడంతో బంగ్లాకు ఈ స్కోరు సాధ్యమైంది. కేశవ్ మహారాజ్ 92 పరుగులకు మూడు వికెట్లు కూల్చాడు. మోర్న్ మోర్కెల్, కాగిసో రబదాకు చెరి రెండేసి వికెట్లు లభించాయి.
మొదటి ఇన్నింగ్స్‌లో 176 పరుగులు ఆధిక్యాన్ని సంపాదించిన దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌ను 56 ఓవర్లలో ఆరు వికెట్లకు 247 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. టెంబా బవూమా (71), కెప్టెన్ ఫఫ్ డు ప్లెసిస్ (81) హాఫ్ సెంచరీలు సాధించారు. బంగ్లా బౌలర్లలో మోనిముల్ హక్ 27 పరుగులకే మూడు వికెట్లు కూల్చాడు. ముస్త్ఫాజుర్ రెహ్మాన్ 30 పరుగులిచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. కాగా, అసాధ్యంగా కనిపిస్తున్న 423 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి రెండో ఇన్నింగ్స్‌ను మొదలుపెట్టిన బంగ్లాదేశ్ 32.4 ఓవర్లలో కేవలం 90 పరుగులకే కుప్పకూలింది. ఇమ్రుల్ కయాస్ (32), కెప్టెన్ ముష్ఫికర్ రహీం (18), మెహదీ హసన్ (15) తప్ప బంగ్లా బ్యాట్స్‌మెన్ ఎవరూ రెండంకెల స్కోరు కూడా చేయలేకపోయారు. కేశవ్ మహారాజ్ 25 పరుగులకే నాలుగు వికెట్లు కూల్చాడు. కాగిసో రబదా మూడు, మోర్న్ మోర్కెల్ రెండు చొప్పున వికెట్లు పడగొట్టి, బంగ్లాదేశ్‌ను దెబ్బతీశారు.
సంక్షిప్త స్కోర్లు
దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్: 148 ఓవర్లలో 3 వికెట్లకు 496 డిక్లేర్డ్ (డీన్ ఎల్గార్ 199, అయిడెన్ మార్‌క్రామ్ 97, హషీం ఆమ్లా 137).
బంగ్లాదేశ్ మొదటి ఇన్నింగ్స్: 89.1 ఓవర్లలో 320 ఆలౌట్ (మహమ్మద్ హక్ 77, మహమ్మదుల్లా 66, కేశవ్ మహారాజ్ 3/92, మోర్న్ మోర్కెల్ 2/51, కాగిసో రబదా 2/84).
దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్: 56 ఓవర్లలో 6 వికెట్లకు 247 డిక్లేర్డ్ (టెంబా బవూమా 71, ఫఫ్ డు ప్లెసిస్ 81, మోనిముల్ హక్ 3/27, ముస్త్ఫాజుర్ రహీం 2/30).
బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్ (లక్ష్యం 423 పరుగులు): 32 ఓవర్లలో 90 ఆలౌట్ (ఇమ్రుల్ కయాస్ 32, ముస్త్ఫాజుర్ రహీం 18, కేశవ్ మహారాజ్ 4/25, కాగిసో రబదా 3/33, మోర్న్ మోర్కెల్ 19/2).

చిత్రం..ఏడు వికెట్లు పడగొట్టి, బంగ్లాదేశ్‌పై దక్షిణాఫ్రికా విజయంలో కీలక భూమిక పోషించిన కేశవ్ మహారాజ్