క్రీడాభూమి

ఏదైనా వార్తే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 2: ఆస్ట్రేలియాతో జరిగే టి-20 ఇంటర్నేషనల్ సిరీస్‌లో తాను అద్భుతంగా రాణిస్తే అది వార్త అవుతుందని, ఒకవేళ విఫలమైతే మరింత పెద్ద వార్తగా మారుతుందని భారత వెటరన్ పేసర్ ఆశిష్ నెహ్రా వ్యాఖ్యానించాడు. మొత్తం మీద ఏదైనా ఒక వార్తగానే మిగిలిపోతుందని అతను పిటిఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అన్నాడు. భారత జట్టుకు ప్రాతినిథ్యం వహించే అవకాశం లభిస్తే ఎవరికి మాత్రం సంతోషం ఉండదు అంటూ ఒక ప్రశ్నపై స్పందిస్తూ 38 ఏళ్ల నెహ్రా అన్నాడు. తన వయసును దృష్టిలో ఉంచుకొని, భవిష్యత్తు గురించి పెద్దగా ఆలోచించడం లేదని అన్నాడు. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి కృషి చేస్తానని తెలిపాడు.

చిత్రం..ఆశిష్ నెహ్రా