క్రీడాభూమి

గో ఇండియా..గో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 2: నాగపూర్‌లో ఆదివారం జరిగిన ఐదవ, చివరి వనే్డలో ఆస్ట్రేలియాను ఏడు వికెట్ల తేడాతో చిత్తుచేసి, సిరీస్‌ను 4-1 తేడాతో సొంతం చేసుకున్న విరాట్ కోహ్లీ సారథ్యంలోని టీమిండియాపై ప్రశంసల జల్లు కురుస్తున్నది. రాబోయే మూడు టి-20 ఇంటర్నేషనల్స్ సిరీస్‌లోనూ ఇదే స్థాయిలో చెలరేగి, విజయాలను నమోదు చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. భారత క్రికెటర్లకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నారు. వనే్డ సిరీస్‌లో భాగంగా చెన్నైలో జరిగిన మొదటి మ్యాచ్‌కి వర్షం వల్ల అంతరాయం ఏర్పడగా, డక్‌వర్త్ లూయిస్ విధానం ద్వారా భారత్ 26 పరుగుల తేడాతో గెలిచింది. ఆ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్ 50 ఓవర్లలో 7 వికెట్లకు 281 పరుగులు చేసింది. ఇన్నింగ్స్ బ్రేక్ సయంలో భారీ వర్షం కురవడంతో కొంత సేపు ఆటకు అంతరాయం ఏర్పడింది. వాన తగ్గిన తర్వాత ఆసీస్ లక్ష్యాన్ని 21 ఓవర్లలో 164 పరుగులుగా నిర్ణయించారు. దీనిని ఛేదించడంలో విఫలమైన స్టీవెన్ స్మిత్ సేన 9 వికెట్లు కోల్పోయి 137 పరుగులు చేయగలిగింది.
కోల్‌కతాలో ఈడెన్ గార్డెన్స్ మైదానంలో జరిగిన రెండో వనే్డలో భారత్ 50 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 50 ఓవర్లలో 252 పరుగులకు ఆలౌట్‌కాగా, ఆస్ట్రేలియా 43.1 ఓవర్లలో 202 పరుగులు చేయగలిగింది. ఇండోర్‌లో జరిగిన మూడో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్‌కు దిగి, 50 ఓవర్లలో ఆరు వికెట్లకు 293 పరుగులు చేసింది. దీనికి సరైన సమాధానమిచ్చిన భారత్ 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరింది. ఐదు వికెట్ల తేడాతో విజయాన్ని నమోదు చేసి, సిరీస్‌ను సొంతం చేసుకుంది. బెంగళూరులో నాలుగో వనే్డ జరిగింది. ఎదురుదాడికి దిగిన ఆస్ట్రేలియా అసాధారణ బ్యాటింగ్ ప్రతిభ కనబరచి, 50 ఓవర్లలో ఐదు వికెట్లకు 334 పరుగుల భారీ స్కోరు సాధించింది. కాగా, పరుగుల వేటలో విఫలమైన టీమిండియా 50 ఓవర్లలో ఎనిమిది వికెట్లు చేజార్చుకొని 313 పరుగులకు పరిమితమైంది. భారత్ ఆధిక్యాన్ని 3-1కి తగ్గించగలిగింది. ఆదివారం నాటి చివరి వనే్డలో కోహ్లీ బృందం అన్ని విభాగాల్లోనూ రాణించింది. ఆస్ట్రేలియాను 50 ఓవర్లలో 9 వికెట్లకు 242 పరుగులకే పరిమితం చేసింది. అనంతరం లక్ష్యాన్ని కేవలం మూడు వికెట్లు కోల్పోయి ఛేదించిన విషయం తెలిసిందే. రోహిత్ శర్మ శతకం జట్టు విజయంలో కీలకంగా మా రింది. ఈ మ్యాచ్‌లోనే అతను వనే్డల్లో ఆరు వేల పరుగుల మైలు రాయని అధిగమించడం విశేషం. భారత బ్యాటింగ్ లైనప్ పటి ష్టంగా ఉందని అజింక్య రహానే, రోహిత్ మరోసారి రుజువు చేశా రు. ఒకరు విఫలమైతే మరొకరు జట్టును గెలిపించే బాధ్యతను స్వీ కరించడం భారత జట్టుకు కలిసొచ్చే అంశం. మొత్తం మీద సిరీస్‌ను 4-1 తేడాతో ముగించిన కోహ్లీ సేనను మీడియా ప్రశంసల్లో ముంచెత్తింది. పలువురు మాజీ క్రికెటర్లు, వేలాది మంది అభిమానులు కోహ్లీ అండ్ కోకు శుభాకాంక్షలు తెలిపారు. ఈనెల 8న రాంచీలో మొదటి మ్యాచ్‌తో మొదలయ్యే మూడు మ్యాచ్‌ల టి- 20 సిరీస్‌లోనూ ఆస్ట్రేలియాను చిత్తుచేస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. అదే విధంగా న్యూజిలాండ్‌తో జరిగే సిరీస్‌లో భారత్‌దే పైచేయ అవుతుందని జోస్యం చెప్పారు.