క్రీడాభూమి

కరోలినా మారిన్ హైదరాబాద్‌కే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 9: ప్రీమియర్ బాడ్మింటన్ లీగ్ (పిబిఎల్) మూడో సీజన్ వేలంలో స్పెయిన్ సూపర్‌స్టార్, ప్రపంచ నాలుగో ర్యాంకర్ కరోలినా మారిన్‌ను హైదరాబాద్ హంటర్స్ జట్టు మరోసారి నిలబెట్టుకుంది. ఈ వేలంలో హైదరాబాద్ హంటర్స్ రూ.50 లక్షలు వెచ్చించి మారిన్‌ను దక్కించుకుంది. అలాగే భారత టాప్ షట్లర్లు పివి.సింధు, సైనా నెహ్వాల్, కిదాంబి శ్రీకాంత్‌ను కూడా వారి పాత జట్లే దక్కించుకున్నాయి. ఇటీవల గ్లాస్గో (స్కాట్లాండ్)లో జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రజత పతకాన్ని కైవసం చేసుకుని చరిత్ర సృష్టించడంతో పాటు కొరియా సూపర్ సిరీస్ టైటిల్‌ను గెలుచుకున్న పివి.సింధును డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగనున్న చెన్నై స్మాషర్స్ 48.75 లక్షలు వెచ్చించి కాపాడుకోగా, గ్లాస్గోలో కాంస్య పతకాన్ని గెలుచుకున్న సైనా నెహ్వాల్‌ను అవధే వారియర్స్ రూ.41.25 లక్షలు వెచ్చించి నిలబెట్టుకుంది. కాగా, ఇండోనేషియా, ఆస్ట్రేలియా ఓపెన్ సిరీస్‌లలో వరుస టైటిళ్లు సాధించిన కిదాంబి శ్రీకాంత్ మరోసారి అవధే వారియర్స్ జట్టులో ఆడనున్నాడు. అవధే వారియర్స్ ‘రైట్ టు మ్యాచ్’ కార్డును ఉపయోగించి శ్రీకాంత్‌ను అట్టిపెట్టుకోవడంతో ఈసారి అతనికి రూ.56.10 లక్షల పారితోషికం లభించనుంది. గత ఏడాది శ్రీకాంత్‌కు లభించిన పారితోషికం కంటే ఇది దాదాపు 10 శాతం ఎక్కువ. మరోవైపు చైనాకు చెందిన ప్రపంచ నెంబర్ వన్ మహిళా క్రీడాకారిణి తై జు ఇంగ్‌ను అహ్మదాబాద్ స్మాష్ మాస్టర్స్ జట్టు కైవసం చేసుకుంది. ఇందుకోసం ఆ జట్టు యాజమాన్యం రూ.52 లక్షలు వెచ్చించగా, పురుషుల ప్రపంచ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో కొనసాగుతున్న విక్టర్ అలెక్సన్‌ను రూ.50 వెచ్చించి బెంగళూరు బ్లాస్టర్స్ జట్టు, భారత డబుల్స్ బాడ్మింటన్ స్టార్ అశ్వనీ పొన్నప్పను రూ.20 లక్షలతో ఢిల్లీ ఏసర్స్ జట్టు కైవసం చేసుకున్నాయి. అయతే ప్రస్తుత వేలంలో భారతకు చెందిన హెచ్‌ఎస్.ప్రణయ్ అత్యంత ఖరీదైన ఆటగాడిగా అవతరించాడు. అహ్మదాబాద్ స్మాష్ మాస్టర్స్ ఏకంగా రూ.62 లక్షలతో అతడిని కొనుగోలు చేసింది. మొత్తం ఎనిమిది జట్లు (హైదరాబాద్ హంటర్స్, ఢిల్లీ ఏసర్స్, ముంబయి రాకెట్స్, బెంగళూరు బ్లాస్టర్స్, చెన్నై స్మాషర్స్, నార్త్ ఈస్ట్రన్ వారియర్స్, అహ్మదాబాద్ స్మాష్ మాస్టర్స్, అవధె వారియర్స్) పాల్గొన్న ఈ వేలంలో మొత్తం 133 మంది ఆటగాళ్లను అందుబాటులో ఉంచారు. వీరిలో భారత్ నుంచి ‘తెలుగు తేజం’ పివి.సింధుతో పాటు సైనా నెహ్వాల్, కిదాంబి శ్రీకాంత్‌లకు ‘మోస్ట్ ఐకానిక్ ప్లేయర్స్’ జాబితాలో చేర్చారు. ప్రీమియర్ బాడ్మింటన్ లీగ్ మూడో సీజన్ పోటీలు డిసెంబర్ 22 నుంచి జనవరి 14 వరకు (24 రోజుల పాటు) ముంబయి, హైదరాబాద్, లక్నో, చెన్నై, గౌహతి వేదికగా జరుగుతాయి. ఈ ఎడిషన్‌లో విజేతగా నిలిచిన జట్టుకు రూ.3 కోట్లు, రన్నరప్‌కు రూ.1.5 కోట్లు, మూడు, నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లకు రూ.75 లక్షలు చొప్పున నగదు బహుమతి ఇస్తారు.

చిత్రం..అత్యంత ఖరీదైన ఆటగాడు హెచ్‌ఎస్. ప్రణయ్