క్రీడాభూమి

ట్రాక్ ఆసియా కప్ సైక్లింగ్‌లో పతకాల పంట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 10: ట్రాక్ ఆసియా కప్ టోర్నమెంట్‌లో భారత సైక్లిస్టులు పతకాల పంట పండించారు. న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ స్టేడియం కాంప్లెక్స్ వెలోడ్రోమ్‌లో మంగళవారం ప్రారంభమైన ఈ టోర్నమెంట్‌లో భారత సైక్లిస్టులు తొలి రోజే 9 పతకాలను కైవసం చేసుకున్నారు. వీటిలో ఐదు పసిడి పతకాలు ఉన్నాయి. మంగళవారం జరిగిన ఎనిమిది ఫైనల్ ఈవెంట్లలో ఐదింట స్వర్ణ పతకాలను చేజిక్కించుకున్న భారత్ మరో నాలుగు ఈవెంట్లలో రజత పతకాలను తన ఖాతాలో వేసుకుంది. సీనియర్ ఎలైట్ కేటగిరీలో రెండు రజత పతకాలను గెలుచుకున్న భారత టాప్ సైక్లిస్టు దెబోరా, మహిళల 500 మీటర్ల ఎలైట్ ఈవెంట్‌లో పసిడి పతకాన్ని దక్కించుకోవడంలో ఈ ఏడాది కూడా విఫలమైంది. ఈ ఈవెంట్‌లో 36.083 సెకన్లలో లక్ష్యాన్ని అధిగమించిన ఆమె రజత పతకంతో సరిపుచ్చుకోగా, చైనా సైక్లిస్టు యుఫాంగ్ గువో 35.071 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకుని స్వర్ణ పతకాన్ని, ఇండోనేషియాకు చెందిన క్రిస్మోనితా ద్విపుత్రి కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు. కాగా, టీమ్ స్ప్రింట్ ఈవెంట్‌లో అలీనా రెజీతో కలసి 35.404 సెకన్లలో లక్ష్యాన్ని అధిగమించిన దెబోరా మరో రజత పతకాన్ని గెలుచుకుంది. ఈ ఈవెంట్‌లో కూడా చైనా సైక్లిస్టులు చవరుల్ సంగ్, షంజు బావో 34.073 సెకన్ల టైమింగ్‌తో పసిడి పతకాన్ని కైవసం చేసుకోగా, 35.938 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకున్న ఇండోనేషియా సైక్లిస్టులకు కాంస్య పతకం లభించింది.
అశ్విన్‌కు సునాయాస విజయం
అయితే అంతకుముందు పురుషుల జూనియర్ కేటగిరీలో జరిగిన 15 కిలోమీటర్ల పాయింట్ రేస్ ఈవెంట్‌లో అశ్విన్ పాటిల్ 29 పాయింట్లతో పసిడి పతకాన్ని కైవసం చేసుకుని భారత్ పోరాటాన్ని ఘనంగా ప్రారంభించాడు. మొదటి నాలుగు స్ప్రింట్‌లలో ఐదేసి చొప్పున పాయింట్లు రాబట్టుకున్న అశ్విన్ పాటిల్ ఈ ఈవెంట్‌లో సులభంగా విజయం సాధించగా, అతని సహచరుడు నమన్ కపిల్ 29 పాయింట్లతో రజత పతకాన్ని, సౌదీ అరేబియాకి చెందిన హసన్ 21 పాయింట్లతో కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు.
శశికళకు రెండు స్వర్ణాలు
ఆ తర్వాత మహిళల జూనియర్ కేటగిరీలో జరిగిన టీమ్ స్ప్రింట్ ఈవెంట్‌లో శశికళ అగాషే, మయూరి 37.000 సెకన్లలో లక్ష్యాన్ని అధిగమించి భారత్‌కు మరో పసిడి పతకాన్ని అందించగా, భారత్‌కే చెందిన జయశ్రీ, వైష్ణవి 39.544 సెకన్ల టైమింగ్‌తో రజత పతకాన్ని గెలుచుకున్నారు. ఈ ఈవెంట్‌లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ) సైక్లిస్టులకు కాంస్య పతకం లభించింది. కాగా, 500 మీటర్ల టైమ్ ట్రయల్ ఈవెంట్‌లో కూడా శశికళ 37.702 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకుని పసిడి పతకంతో తన ఆధిపత్యాన్ని చాటుకుంది. ఈ ఈవెంట్‌లో ఇండోనేషియాకి చెందిన ఇవాంజిలినా లియోంటిన్ (41.545 సెకన్లు)కు రజత పతకం, యుఎఇ సైక్లిస్టుకు కాంస్య పతకం లభించాయి.
పురుషుల టీమ్ స్ప్రింట్‌లో
సరికొత్త జాతీయ రికార్డు
ఇదిలావుంటే, పురుషుల టీమ్ స్ప్రింట్ ఈవెంట్‌లో సాహిల్ కుమార్, రంజిత్ సింగ్, అపోలోనియస్‌తో కూడిన భారత ఎలైట్ జట్టు 47.399 సెకన్లలో లక్ష్యాన్ని అధిగమించి పసిడి పతకాన్ని కైవసం చేసుకోవడంతో పాటు సరికొత్త జాతీయ రికార్డును సృష్టించింది. ఏషియన్ గేమ్స్‌లో పసడి పతకం సాధించిన జట్టు టైమింగ్ కంటే ఇది మెరుగైన టైమింగ్. ఈ ఈవెంట్‌లో 47.399 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకుని రజత పతకం సాధించిన యుఎఇ జట్టు టైమింగ్‌లో భారత జట్టు కంటే ఎంతో వెనుకబడింది. కాగా, పురుషుల జూనియర్ టీమ్ స్ప్రింట్ ఈవెంట్‌లో జెకె.అశ్విన్, మయూర్ పవార్, అభిషేక్ కష్దీలతో కూడిన జట్టు భారత్‌కు మరో పసిడి పతకాన్ని అందించగా, పురుషుల జూనియర్ 4 కిలోమీటర్ల టీమ్ ఈవెంట్‌లో భారత్‌కు మరో రజత పతకం లభించింది.