క్రీడాభూమి

విశాఖలో నేషనల్ బాక్సింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, అక్టోబర్ 10: నేషనల్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ పోటీలను ఈ నెల 24 నుంచి 30 వరకు విశాఖలోని స్వర్ణ్భారతి ఇండోర్ స్టేడియంలో నిర్వహిస్తున్నట్టు డివిజనల్ రైల్వే మేనేజర్ ముకుల్ సరన్ మాథూర్ తెలిపారు. మంగళవారం నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కల్పించిన అవకాశంతో రైల్వే స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డు (ఆర్‌ఎస్‌పిబి) ఆధ్వర్యంలో ద్వితీయ జాతీయ బాక్సింగ్ పోటీలు విశాఖలో నిర్వహించాలని నిర్ణయించామన్నారు. ఇందులో భాగంగా ఈ పోటీలు ఈ నెల 24న ప్రారంభమవుతాయన్నారు. జాతీయ స్థాయి బాక్సర్లు ఇందులో పాల్గొంటారన్నారు. ప్రథమ జాతీయ బాక్సింగ్ పోటీలు గత ఏడాది గౌహాతిలో జరిగాయి. ఈ పోటీల్లో ఈస్ట్‌కోస్ట్ రైల్వే వాల్తేర్ డివిజన్ నుంచి శ్యామ్‌కుమార్ పాల్గొనగా 49 కిలోల కేటగిరీలో సిల్వర్ మెడల్ లభించిందన్నారు. రైల్వేస్ తరపున శ్యామ్, సాగర్, బాల, భాస్కర్ న్యూఢిల్లీలో జరిగే కోచింగ్ శిక్షణ శిబిరంలో పాల్గొన్నారన్నారు. ఈస్ట్‌కోస్ట్ రైల్వే వాల్తేర్ డివిజన్‌కు చెందిన ఆర్.శ్రీనివాసరావు కూడా ఈ శిబిరానికి హాజరయ్యాడన్నారు. విశాఖలో జరిగే ఈ ఛాంపియన్‌షిప్‌లో 400 మంది వరకు బాక్సర్లు పాల్గొనే అవకాశం ఉందన్నారు. వేర్వేరు సమాఖ్యల నుంచి 36 ఎంట్రీలు వచ్చాయన్నారు. బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొనే క్రీడాకారుల కోసం స్వర్ణ్భారతి స్టేడియానికి మూడు కిలోమీటర్ల పరిధిలో వసతి, రవాణా సదుపాయం కల్పిస్తున్నామన్నారు. బ్రెజిల్ దేశంలో గత ఏడాది ఆగస్టు 5 నుంచి 21 వరకు జరిగిన 31వ ఒలింపిక్ క్రీడల్లో భారతీయ రైల్వే నుంచి 35 మంది ప్రతినిధులు పాల్గొన్నారన్నారు. నేషనల్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ పోటీలకు సంబంధించి బ్రోచర్‌ను డిఆర్‌ఎం ఎంఎస్ సరన్ ఈ సందర్భంగా ఆవిష్కరించారు. రైల్వే స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డు (ఆర్‌ఎస్‌పిబి) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రేఖాయాదవ్, అదనపు డివిజనల్ రైల్వేమేనేజర్ అజయ్ అరోరా, స్పోర్ట్స్ ఆఫీసర్ సక్కీర్ హౌస్సెన్, అసిస్టెంట్ స్పోర్ట్స్ ఆఫీసర్ విష్ణుమూర్తి పాల్గొన్నారు.

చిత్రం..చాంపియన్‌షిప్ బ్రోచర్‌ను విడుదల చేస్తున్న డివిజనల్ రైల్వే మేనేజర్ ముకుల్ సరన్ మాథూర్