క్రీడాభూమి

సింధు, శ్రీకాంత్‌పైనే ఆశలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒడెన్స్, అక్టోబర్ 16: డెన్మార్క్ ఓపెన్ బాడ్మింటన్ సూపర్ సిరీస్‌లో పివి సింధు, కిడాంబి శ్రీకాంత్ టైటిళ్లను అందుకుంటారని అభిమానులు ఆశిస్తున్నారు. మంగళవారం నుంచి ప్రారంభం కానున్న ఈ టోర్నమెంట్‌లో వీరిద్దరూ తమతమ విభాగాల్లో విజేతలుగా నిలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే, ఇటీవల జరిగిన జపాన్ ఓపెన్‌లో ఎదురైన వైఫల్యాలను వాళ్లు పక్కకుపెట్టి, ఎలాంటి ఒత్తిడి లేకుండా ఆడాల్సి ఉంటుంది. రియో ఒలింపిక్స్‌లో, ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో రజత పతకాలను కైవసం చేసుకున్న తెలుగు తేజం సింధు ఈ సీజన్‌లో ఇండియన్ ఓపెన్, కొరియా ఓపెన్ టైటిళ్లను అందుకుంది. అయితే, గత నెల జపాన్ ఓపెన్ రెండో రౌండ్‌లో స్థానిక క్రీడాకారిణి నొజొమీ ఒకుహరా చేతిలో సింధు అనూహ్యంగా పరాజయాన్ని చవిచూసింది. కానీ, ఆతర్వాత ముమ్మరంగా ప్రాక్టీస్ చేసి, డెన్మార్క్ ఓపెన్‌కు సిద్ధమైంది. తొలి రౌండ్‌లో ఆమె చైనాకు చెందిన ప్రపంచ పదో ర్యాంకర్ చెన్ యుఫెయ్‌ను ఢీ కొంటుంది. అంతకు ముందు ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో యుఫెయ్ ఓడించిన సింధు మరోసారి అదే ఫలితాన్ని పునరావృతం చేస్తుందని విశే్లషకుల అభిప్రాయం. ఫలితాలన్నీ ముందుగా ఊహించిన విధంగానే ఉంటే, సెమీ ఫైనల్‌లో ఆమెకు ఏడో సీడ్ హి బింజియావో ఎదురుకావచ్చు. ఇప్పటి వరకూ తొమ్మిది పర్యాయాలు ఆమెతో తలపడిన సింధు నాలుగు విజయాలను సాధించింది. బిజియావో ఐదు మ్యాచ్‌లను గెలిచి మెరుగైన స్థితిలో ఉంది. కాబట్టి, ఆ మ్యాచ్ సింధుకు అగ్ని పరీక్షగా మారడం ఖాయం. కాలి గాయం నుంచి కోలుకున్న సింధు మరోసారి అదే సమస్య తలెత్తకుండా జాగ్రత్త పడుతున్నది. ఈ క్రమంలోనే దూకుడును తగ్గించిందన్న వాదన లేకపోలేదు. తనదైన శైలిలో ఆడితే, పతకం సాధించడం సింధుకు కష్టం కాకపోవచ్చు.
పురుషుల సింగిల్స్‌లో శ్రీకాంత్‌ను క్రీడా పండితులు ఫేవరిట్‌గా పేర్కొంటున్నారు. ఇటీవలే వరుసగా ఇండోనేసియా, ఆస్ట్రేలియా ఓపెన్ టైటిళ్లను అందుకొని మంచి ఫామ్‌లో ఉన్న అతను ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో క్వార్టర్ ఫైనల్స్ వరకూ చేరాడు. డెన్మార్క్ ఓపెన్‌లోనూ అతను మొదటి రెండు రౌండ్లను సులభంగానే అధిగమించే అవకాశాలున్నాయి. అయితే, క్వార్టర్ ఫైనల్స్‌లో అతనికి స్థానిక ఫేవరిట్ విక్టర్ ఎక్సెల్‌సెన్ ఎదురుకావచ్చు. కాగా, సాయి ప్రణీత్, హెచ్‌ఎస్ ప్రణయ్ కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. శ్రీకాంత్‌ను ఫైనల్‌లో ఓడించి, కెరీర్‌లో తొలి సూపర్ సిరీస్ టైటిల్‌ను సింగపూర్ ఓపెన్ రూపంలో సొంతం చేసుకున్న ప్రణీత్ టైటిల్ సాధించడం ఎలావున్నా, మేటి ఆటగాళ్లకు సైతం గట్టిపోటినివ్వడం ఖాయం.

చిత్రం..ఆశాకిరణం పివి సింధు