క్రీడాభూమి

యాషెస్ అంటే యుద్ధమే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిడ్నీ, అక్టోబర్ 16: ఇంగ్లాండ్‌తో జరిగే ప్రతిష్ఠాత్మక యాషెస్ సిరీస్ అంటే ఒక యుద్ధమేనని, ప్రత్యర్థుల పట్ల ఎంత విద్వేషాన్ని పెంచుకుంటే అంతగా రాణించగలుగుతామని ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ వ్యాఖ్యానించాడు. ఒక చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అతను మాట్లాడుతూ, ఇంగ్లాండ్ ఆటగాళ్లను తాను శత్రువులుగానే పరిగణిస్తానని స్పష్టం చేశాడు. వారి కళ్లలో భయాన్ని చూస్తానని, అదే విధంగా వారి పట్ల తనకు ఏ స్థాయిలో ద్వేషం ఉన్నదనేది తన కళ్లలో వారికి స్పష్టంగా కనిపిస్తుందని చెప్పాడు. ‘ఇది ఒక యుద్ధం. సమరాంగణంలో మిత్రత్వానికి చోటు ఉండదు. ఆస్ట్రేలియాకు ఇంగ్లాండ్ చిరకాల ప్రత్యర్థి. అప్పటికీ, ఇప్పటికీ రెండు జట్ల మధ్య ఆధిపత్య పోరు భీకరంగానే ఉంది. ఇక ముందు కూడా అదే రీతిలో కొనసాగుతుంది’ అన్నాడు. ఒక వ్యక్తిపై దాడి చేసిన కేసులో నిందితుడిగా ఉన్న ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ ఆస్ట్రేలియాకు వస్తాడా? లేదా? అన్నది తాను పట్టించుకోబోమని వార్నర్ స్పష్టం చేశాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంగ్లాండ్‌ను ఓడించి, యాషెస్ సిరీస్‌లో విజయకేతనం ఎగరేయడానికి ప్రయత్నిస్తామని, కాబట్టి, జట్టులో ఎవరెవరు ఉన్నారన్నది తమకు ముఖ్యం కాదని అన్నాడు.