క్రీడాభూమి

అమెరికా సాకర్ సమాఖ్య అధ్యక్షుడి రాజీనామా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చికాగో, అక్టోబర్ 16: రష్యాలో జరిగే 2018 సాకర్ ప్రపంచ కప్ ఫైనల్స్‌కు అర్హత సంపాదించడంలో అమెరికా విఫలం కావడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అన్ని వర్గాల నుంచి నిరసనలు వ్యక్తం కావడంతో, అమెరికా సాకర్ సమాఖ్య (యుఎస్‌ఎస్‌ఎఫ్) అధ్యక్షుడు సునీల్ గులాటీ తన పదవికి రాజీనామా చేశాడు. జట్టు చీఫ్ కోచ్ బ్రూస్ ఎరెనా తన బాధ్యతల నుంచి వైదొలగిన కొన్ని గంటల్లోనే, భారత సంతతికి చెందిన గులాటీ రాజీనామా సమర్పించడం గమనార్హం. వరల్డ్ కప్ క్వాలిఫయర్స్‌లో అత్యంత కీలకమైన మ్యాచ్‌ని ట్రినిడాడ్ అండ్ టొబాగో చేతిలో అమెరికా 1-2 తేడాతో చేజార్చుకున్న విషయం తెలిసిందే. 1986 తర్వాత మొదిసారి వరల్డ్ కప్ ఫైనల్స్‌కు అమెరికా క్వాలిఫై కాలేకపోవడం సహజంగానే అభిమానులను ఆగ్రహానికి గురిచేసింది. కాగా, ఈ వైఫల్యానికి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేస్తున్నట్టు 58 ఏళ్ల గులాటీ ప్రకటించాడు. తమ జట్టు తప్పనిసరిగా అర్హత సంపాదిస్తుందని అనుకున్నామని, కానీ, అందుకు భిన్నమైన ఫలితం రావడం తమను దిగ్భ్రాంతికి గురి చేసిందని అన్నాడు. నిజానికి రాజీనామా చేయాలన్న ఆలోచన తనకు లేదని అతను స్పష్టం చేశాడు. 2026 వరల్డ్ కప్‌ను నిర్వహించేందుకు మెక్సికో, కెనడాతో కలిసి సంయుక్తంగా బిడ్ వేస్తున్నామని, ఆ ప్రయత్నాలు కొనసాగుతున్న తరుణంలోనే రాజీనామా చేయాల్సి రావడం దురదృష్టకరమని అన్నాడు. ఒకవేళ తనకు మరోసారి బాధ్యతలను అప్పచెప్తే, వాటిని నిర్వర్తించడానికి సిద్ధంగా ఉంటానని 2006 మార్చి నుంచి యుఎస్‌ఎస్‌ఎఫ్ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న గులాటీ స్పష్టం చేశాడు.