క్రీడాభూమి

క్వార్టర్ ఫైనల్‌కు ఇరాన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మార్గోవా, అక్టోబర్ 17: ఫిఫా అండర్-17 ప్రపంచ కప్ ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో ఇరాన్ జట్టు క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. మంగళవారం ఇక్కడ జరిగిన ప్రీ-క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో ఆ జట్టు 2-1 గోల్స్ తేడాతో మెక్సికోపై విజయం సాధించింది. మ్యాచ్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన ఇరాన్ జట్టుకు 7వ నిమిషంలో మహమ్మద్ షరీఫీ తొలి గోల్‌ను అందించాడు. ఆ తర్వాత మరో నాలుగు నిమిషాలకు అల్లహియార్ సయ్యద్ సాధించిన గోల్‌తో ఇరాన్ ఆధిక్యత 2-0కు పెరిగింది. అయితే 37వ నిమిషంలో మెక్సికో జట్టుకు రాబెర్టో డీ లా రోసా తొలి గోల్‌ను అందించడంతో ఇరాన్ ఆధిక్యత 2-1 గోల్స్‌కు తగ్గింది. ఆ తర్వాత ఇరు జట్లు ఒక్క గోల్‌ను కూడా సాధించలేకపోయాయి. దీంతో ఈ మ్యాచ్‌లో విజయం సాధించిన ఇరాన్ జట్టు కొచ్చిలో జరిగే క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో స్పెయిన్‌తో తలపడనుంది.
స్పెయన్‌ను గెలిపించిన రుయిజ్
గౌహతిలో జరిగిన మరో ప్రీ-క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో స్పెయిన్ జట్టు 2-1 గోల్స్ తేడాతో ఫ్రాన్స్‌పై విజయం సాధించింది. మ్యాచ్ చివర్లో అబ్దెల్ రుయిజ్ అద్భుతమైన గోల్ సాధించి ఫ్రాన్స్‌కు ఈ విజయాన్ని అందించాడు. ఆరంభం నుంచే హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో చాలాసేపు ఇరు జట్లు గోల్స్ సాధించలేకపోయాయి. అయితే 34వ నిమిషంలో లెన్నీ పింటర్ సాధించిన గోల్‌తో ఫ్రాన్స్ 1-0 ఆధిక్యత సాధించింది. కానీ ఆ సంతోషం ఎంతోసేపు నిలువలేదు. పది నిమిషాల తర్వాత స్పెయిన్‌కు జువాన్ మిరాండ ఈక్వలైజర్‌ను అందించడంతో ఇరు జట్ల స్కోరు సమమమైంది. ఆ తర్వాత కూడా ఇరు జట్లు చాలాసేపు గోల్స్ సాధించకపోవడంతో మ్యాచ్ ఉత్కంఠ భరితంగా మారింది. అయితే 90వ నిమిషంలో అబ్దెల్ రియాజ్ అద్భుతమైన గోల్ సాధించడంతో 2-1 తేడాతో విజయం సాధించిన స్పెయిన్ జట్టు క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లింది.
మాలీ, ఇంగ్లాండ్ పురోగమనం
అలాగే మంగళవారం రాత్రి మార్గోవాలో జరిగిన రెండో ప్రీ-క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో మాలీ జట్టు 5-1 గోల్స్ తేడాతో ఇరాన్‌ను మట్టికరిపించగా, కోల్‌కతాలో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్ 5-3 గోల్స్ తేడాతో పెనాల్టీ షూటౌట్‌లో జపాన్‌ను మట్టికరిపించి క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లింది.

చిత్రం..స్పెయన్ ఆటగాళ్ల విజయోత్సాహం