క్రీడాభూమి

రెండో వనే్డలో పాక్ గెలుపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అబుధాబీ, అక్టోబర్ 17: ఐదు మ్యాచ్‌ల వనే్డ క్రికెట్ సిరీస్‌లో భాగంగా శ్రీలంకతో జరిగిన తొలి మ్యాచ్‌లో ఓటమిపాలైన పాకిస్తాన్ జట్టు రెండో మ్యాచ్‌లో పుంజుకుంది. అబుధాబీలో జరిగిన ఈ మ్యాచ్‌లో పాక్ జట్టు 32 పరుగుల తేడాతో శ్రీలంకను ఓడించి సిరీస్‌ను సమం చేసింది. టాస్ గెలిచి తొలుత ఇన్నింగ్స్ ప్రారంభించిన పాకిస్తాన్ జట్టులో ఓపెనర్లు ఫఖర్ జమన్ (11), అహ్మద్ షెహజాద్ (8) విఫలమైనప్పటికీ ఫస్ట్‌డౌన్ బ్యాట్స్‌మన్ బాబర్ ఆజమ్ (133 బంతుల్లో 101 పరుగులు) వరుసగా రెండో శతకంతో సత్తా చాటుకున్నాడు. అతనికి తోడుగా షాదబ్ ఖాన్ (68 బంతుల్లో 52 పరుగులు) అజేయ అర్థ శతకంతో రాణించడంతో పాకిస్తాన్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 219 పరుగులు సాధించింది.
అనంతరం 220 పరుగుల లక్ష్యంతో ఇన్నింగ్స్ ప్రారంభించిన శ్రీలంక జట్టులో ఓపెనర్ నిరోషన్ డిక్వెల్లా (3) విఫలమైనప్పటికీ పాక్ బౌలర్లను సమర్ధవంతంగా ప్రతిఘటించిన కెప్టెన్ ఉపుల్ తరంగ (144 బంతుల్లో 112 పరుగులు) క్రీజ్‌లో నిలదొక్కుకుని అజేయ శతకంతో రాణించాడు. అయితే మిగిలిన బ్యాట్స్‌మెన్‌లో మెండిస్ (10), లహిరు తిరిమానే (12), వాండెర్సె (22) మినహా ఎవరూ రెండంకెల స్కోర్లు రాబట్టకుండానే పెవిలియన్‌కు పరుగు తీయడంతో 48 ఓవర్లలో 187 పరుగులకే ఆలౌటైన శ్రీలంక జట్టు 32 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.