క్రీడాభూమి

ఆసియా కప్ హాకీ గుర్జంత్ కీలక గోల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఢాకా, అక్టోబర్ 18: ఆసియా కప్ హాకీ టోర్నమెంట్‌లో బుధవారం దక్షిణ కొరియాను ఢీకొన్న భారత్ మ్యాచ్‌ని అతి కష్టం మీద డ్రా చేసుకోగలిగింది. గుర్జంత్ సింగ్ కీలక గోల్ చేసి, భారత్ పరువు నిలబెట్టాడు. మ్యాచ్ ఆరంభం నుంచి ఇరు జట్లు తీవ్రంగా పోటీపడ్డాయి. 41 నిమిషంలో గుంజున్ లీ గోల్ చేయడంతో, కొరియా 1-0 ఆధిక్యాన్ని సంపాదించింది. ఇప్పటి వరకూ జరిగిన మ్యాచ్‌ల్లో విజయాలను నమోదు చేసిన భారత్ తొలిసారి ఓటమి ప్రమాదంలో పడింది. అయితే, 60వ నిమిషంలో గుర్జంత్ ఈక్వెలైజర్‌ను సాధించడంతో ఊపిరి పీల్చుకుంది. ప్రత్యర్థి జట్టుకు మరో గోల్ చేసే అవకాశం ఇవ్వకుండా మ్యాచ్‌ని డ్రా చేసుకుంది.