క్రీడాభూమి

బ్యాటింగ్‌లో డివిలియర్స్ టాప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుబాయ్, అక్టోబర్ 20: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) ప్రకటించిన తాజా ప్రపంచ ర్యాంకింగ్స్ బ్యాటింగ్ విభాగంలో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీని రెండో స్థానానికి నెట్టేసిన దక్షిణాఫ్రికా స్టార్ ఎబి డివిలియర్స్ నంబర్ వన్ స్థానాన్ని ఆక్రమించాడు. డివిలియర్స్ ప్రస్తుతం 879 పాయింట్లతో అగ్రస్థానంలో నిలవగా, కోహ్లీ ఖాతాలో 877 పాయింట్లు ఉన్నాయి. ఆస్ట్రేలియాకు చెందిన డేవిడ్ వార్నర్ 865 పాయింట్లతో మూడో స్థానాన్ని సంపాదించాడు. బౌలింగ్ విభాగంలో జస్‌ప్రీత్ బుమ్రా ఆరు, అక్షర్ పటేల్ ఎనిమిది స్థానాల్లో ఉన్నారు. బౌలింగ్‌లో పాకిస్తాన్‌కు చెందిన హసన్ అలీ నంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్నాడు. ఆల్‌రౌండర్స్ విభాగంలో భారత క్రికెటర్లలో ఎవరూ ‘టాప్-10’లో చోటు దక్కించుకోలేకపోయారు. హార్దిక్ పాండ్య అత్యుత్తమంగా 15వ స్థానంలో ఉన్నాడు. రవీంద్ర జడేజా 19వ స్థానంలో ఉండి, ‘టాప్-20’లో చేరాడు. ఈ ఆల్‌రౌండర్స్ విభాగంలో మహమ్మద్ హఫీజ్ (పాకిస్తాన్) నంబర్ వన్ స్థానంలో నిలిచాడు.
టీం ర్యాంకింగ్స్‌లో భారత్ రెండో స్థానంలో ఉండగా, దక్షిణాఫ్రికా నంబర్ వన్ స్థానాన్ని ఆక్రమించింది. నిజానికి రెండు జట్లు చెరి 120 రేటింగ్ పాయింట్లతో సమవుజ్జీగా నిలిచాయి. అయితే, దక్షిణాఫ్రికా 52 మ్యాచ్‌ల్లో మొత్తం 6,244 పాయింట్లు సంపాదించగా, భారత్ 50 మ్యాచ్‌ల్లో 5,993 పాయింట్లు చేసింది. ఈ తేడాతోనే దక్షిణాఫ్రికాకు నంబర్ వన్ స్థానం దక్కింది.
ఐసిసి ప్రపంచ వనే్డ ర్యాంకింగ్స్
టీం ర్యాంకింగ్స్ ‘టాప్-10’
1. దక్షిణాఫ్రికా (120 రేటింగ్ పాయింట్లు), 2. భారత్ (120 రేటింగ్ పాయింట్లు), 3. ఆస్ట్రేలియా (52 మ్యాచ్‌ల్లో 114 రేటింగ్ పాయింట్లు), 4. ఇంగ్లాండ్ (54 మ్యాచ్‌ల్లో 114 రేటింగ్ పాయింట్లు), 5. న్యూజిలాండ్ (111 రేటింగ్ పాయింట్లు), 6. పాకిస్తాన్ (98 రేటింగ్ పాయింట్లు), 7. బంగ్లాదేశ్ (92 రేటింగ్ పాయింట్లు), 8. శ్రీలంక (84 రేటింగ్ పాయింట్లు), 9. వెస్టిండీస్ (77 రేటింగ్ పాయింట్లు), 10. అఫ్గానిస్తాన్ (54 రేటింగ్ పాయింట్లు).
బౌలింగ్ విభాగం ‘టాప్-10’
1. హసన్ అలీ (పాకిస్తాన్/ 743 పాయింట్లు), 2. ఇమ్రాన్ తాహిర్ (దక్షిణాఫ్రికా/ 726 పాయింట్లు), 3. జొష్ హాజెల్‌వుడ్ (ఆస్ట్రేలియా/ 714 పాయింట్లు), 4. కాగిసో రబదా (దక్షిణాఫ్రికా/ 703 పాయింట్లు), 5. మిచెల్ స్టార్క్ (ఆస్ట్రేలియా/ 684 పాయింట్లు), 6. జస్‌ప్రీత్ బుమ్రా (్భరత్/ 671 పాయింట్లు), 7. ట్రెంట్ బౌల్ట్ (న్యూజిలాండ్/ 665 పాయింట్లు), 8. అక్షర్ పటేల్ (్భరత్/ 663 పాయింట్లు), 9. రషీద్ ఖాన్ (అఫ్గానిస్తాన్/ 647 పాయింట్లు), 10. సునీల్ నారైన్ (వెస్టిండీస్/ 646 పాయింట్లు).
ఆల్‌రౌండర్స్ విభాగం ‘టాప్-10’
1. మహమ్మద్ హఫీజ్ (పాకిస్తాన్/ 360 పాయింట్లు), 2. షకీబ్ అల్ హసన్ (బంగ్లాదేశ్/ 345 పాయింట్లు), 3. మహమ్మద్ నబీ (అఫ్గానిస్తాన్/ 329 పాయింట్లు), 4. ఏంజెలో మాథ్యూస్ (శ్రీలంక/ 295 పాయింట్లు), 5. బెన్ స్టోక్స్ (ఇంగ్లాండ్/ 292 పాయింట్లు), 6. జేమ్స్ ఫాల్క్‌నెర్ (ఆస్ట్రేలియా/ 280 పాయింట్లు), 7. జాసన్ హోల్డర్ (వెస్టిండీస్/ 272 పాయింట్లు), 8. మోయిన్ అలీ (ఇంగ్లాండ్/ 267 పాయింట్లు), 9. మిచెల్ మార్ష్ (ఆస్ట్రేలియా/ 259 పాయింట్లు), 10. క్రిస్ వోక్స్ (ఇంగ్లాండ్/ 255 పాయింట్లు).
బ్యాటింగ్ విభాగం ’టాప్-10’
1. ఎబి డివిలియర్స్ (దక్షిణాఫ్రికా/ 877 పాయింట్లు), 2. విరాట్ కోహ్లీ (్భరత్/ 877 పాయింట్లు), 3. బాబర్ ఆజం (పాకిస్తాన్/ 833 పాయింట్లు), 4. క్వింటన్ డి కాక్ (దక్షిణాఫ్రికా/ 802 పాయింట్లు), 5. జో రూట్ (ఇంగ్లాండ్/ 802 పాయింట్లు), 6. రోహిత్ శర్మ (్భరత్/ 790 పాయింట్లు), 7. కేన్ విలియమ్‌సన్ (న్యూజిలాండ్/ 779 పాయింట్లు), 8. హషీం ఆమ్లా (దక్షిణాఫ్రికా/ 770 పాయింట్లు), 9. ఫఫ్ డు ప్లెసిస్ (దక్షిణాఫ్రికా/ 754 పాయింట్లు), 10. మార్టిన్ గుప్టిల్ (న్యూజిలాండ్/ 749 పాయింట్లు).

చిత్రం..డివిలియర్స్