క్రీడాభూమి

ఎవరు గెలిచినా రికార్డే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, అక్టోబర్ 27: అండర్-17 సాకర్ వరల్డ్ కప్‌లో శనివారం ఒక కొత్త రికార్డు నమోదు కానుంది. ఇప్పటి వరకూ ఒక్కసారి కూడా ఈ టైటిల్‌ను అందుకోలేకపోయిన స్పెయిన్, ఇంగ్లాండ్ జట్లు ఫైనల్‌లో తలపడడమే ఇందుకు కారణం. మూడు వారాల పాటు ఉత్కంఠ భరితంగా కొనసాగిన ఈ టోర్నమెంట్ తుది దశకు చేరుకుంది. సుమారు 66,000 మంది ప్రేక్షకులతో సాల్ట్ లేక్ స్టేడియం కళకళలాడితే, భారీ జన సందోహం సమక్షంలో టైటిల్ కోసం పోరాడడం స్పెయిన్, ఇంగ్లాండ్ ఆటగాళ్లకు సరికొత్త పాఠాలు నేర్పడం ఖాయం. రెండు జట్లు దూకుడుగా అడే తత్వం ఉన్నవే కాబట్టి, ప్రేక్షకులకు, అభిమానులకు పసందైన విందు సిద్ధం కానుంది. ఈ టోర్నీలో ఇంత వరకూ ఇంగ్లాండ్ 18 గోల్స్ సాధిస్తే, స్పెయిన్ 15 గోల్స్ చేసింది. నాలుగోసారి ఈ టోర్నీలో అడుగుపెట్టిన ఇంగ్లాండ్ మొదటిసారి ఫైనల్ చేరగా, గతంలో మూడు పర్యాయాలు టైటిల్ పోరులో పోటీపడిన స్పెయిన్ నాలుగోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. కాగా, ఐరోపాకు చెందిన రెండు దేశాలు ఫైనల్ చేరడం ఇదే తొలిసారి కావడం ఓ విశేషం. ఈ ఏడాది మే మాసంలో క్రొయేషియాలో జరిగిన యూరోపియన్ అండర్-17 చాంపియన్‌షిప్‌లో ఈ రెండు జట్లు ఫైనల్ చేరాయి. హోరాహోరీగా సాగిన తుది పోరులో ఇరు జట్లు చెరి రెండు గోల్స్‌తో సమవుజ్జీలుగా నిలిచాయి. దీనితో పెనాల్టీ షూటౌట్ అనివార్యమైంది. అందులో స్పెయిన్ గెలుపొందగా, ఇంగ్లాండ్ రన్నరప్ ట్రోఫీతో సరిపుచ్చుకుంది. ఈసారి ఆ ఫలితాన్ని తారుమారు చేయాలన్న ధ్యేయంతో ఇంగ్లాండ్ అన్ని అస్త్రాలను సిద్ధం చేసుకుంది. ఈ ఏడాది జనవరిలో, కొరియాలో జరిగిన అండర్-20 వరల్డ్ కప్‌ను ఇంగ్లాండ్ కైవసం చేసుకుంది. అండర్-19 జట్టు యూరోపియన్ చాంపియన్‌షిప్‌ను గెల్చుకుంది. ఇప్పుడు అండర్-17 జట్టు వరల్డ్ కప్‌ను సాధిస్తే, సాకర్ ప్రపంచంలో ఇంగ్లాండ్ బలమైన శక్తిగా తనను తాను నిరూపించుకుంటుంది. ఒక మ్యాచ్‌ని మినహాయిస్తే, ఈ టోర్నీలో మిగతా అన్ని మ్యాచ్‌లను ఇంగ్లాండ్ సాల్ట్ లేక్ స్టేడియంలోనే ఆడింది. సెమీ ఫైనల్‌లో ఫేవరిట్ జట్టు బ్రెజిల్‌కు షాకిచ్చింది. అంతేగాక, టోర్నీమెంట్ మొత్తం మీద పరాజయం ఎదుర్కోని ఏకైక జట్టు కూడా అదే. జపాన్‌తో జరిగిన ప్రీ క్వార్టర్స్‌ను పెనాల్టీ షూటౌట్ వరకూ తీసుకెళ్లడాన్ని మినహాయిస్తే, ఇంగ్లాండ్ తన ప్రత్యర్థులపై పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఈ అంశాలు ఇంగ్లాండ్‌కే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయనే అభిప్రాయాన్ని కలిగిస్తున్నాయి.
కాగితంపై చూస్తే, ఇంగ్లాండ్ కొద్దిపాటి పైచేయిని కనబరుస్తూ, ఫేవరిట్ ముద్ర వేయించుకున్నప్పటికీ, స్పెయిన్‌ను తక్కువ అంచనా వేయడానికి వీల్లేదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. బంతిని సాధ్యమైనంత ఎక్కువ సేపు తమ మధ్యే ఉంచుకునే ‘టికా-టాకా’ వ్యూహాన్ని సమర్థంగా అమలు చేయడంలో స్పెయిన్‌ను మించిన జట్టు లేదు. ఇంగ్లాండ్ స్ట్రయికర్ రియాన్ బ్రూస్టర్‌కు సమవుజ్జీగా నిలిచే సత్తా స్పెయిన్ స్ట్రయికర్, కెప్టెన్ అబెల్ రూయిజ్‌కు ఉంది. సెమీ ఫైనల్‌లో బ్రెజిల్‌పై హ్యాట్రిక్ నమోదు చేయడం ద్వారా బ్రూస్టర్ ఇంగ్లాండ్‌ను ఫైనల్ చేర్చాడు. రూయిజ్ మాలీపై రెండు గోల్స్ సాధించి, స్పెయిన్‌కు ఫైనల్‌లో చోటు సంపాదించిపెట్టాడు. రెండు జట్లు తమతమ వ్యూహాలతో సిద్ధంగా ఉండడంతో, ఈసారి ఫైనల్ ఉత్కంఠ రేపనుంది.

తమ తమ ప్రత్యర్థులను ఓడించి, అండర్-17 వరల్డ్ కప్‌లో సెమీ ఫైనల్ చేరినప్పుడు ఇంగ్లాండ్, స్పెయన్ ఆటగాళ్ల ఆనందం (ఫైల్ ఫొటోలు)