క్రీడాభూమి

ఆయన వల్లే గందరగోళం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వీర్‌భద్ర సింగ్ వైఖరి వల్లే భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య ధర్మశాలలో ఈనెల 19న జరగాల్సిన టి-20 ప్రపంచ కప్ గ్రూప్ మ్యాచ్‌పై చివరి వరకూ గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయని బిసిసిఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ ధ్వజమెత్తాడు. ప్రతిష్ఠాత్మకమైన ఈ టోర్నీ షెడ్యూల్ ఏడాది క్రితమే ఖరారైందని, ఆరు నెలల ముందు వేదికలను కూడా ప్రకటించామని విలేఖరులతో మాట్లాడిన అతను గుర్తుచేశాడు. కానీ, నిన్నమొన్నటి వరకూ వౌనంగా ఉన్న వీర్‌భద్ర సింగ్ చివరి క్షణాల్లో ఈ మ్యాచ్‌కి భద్రత కల్పించలేమంటూ ప్రకటించడంలో అర్థమేమిటని ప్రశ్నించాడు. కేంద్రాన్ని ఏదో ఒక రకంగా ఇరకాటంలో పెట్టడానికి హిమాచల్ ప్రదేశ్‌లోని కాంగ్రెస్ సర్కార్ ప్రయత్నిస్తున్నదని ఆరోపించాడు. క్రీడలపై రాజకీయాలను రుద్దుతున్నాడంటూ వీర్‌భద్ర సింగ్‌పై విరుచుకుపడ్డాడు. భద్రత కల్పించడం సాధ్యం కాదని ప్రకటించడం ద్వారా పాకిస్తాన్‌కు అతను పంపదలచుకున్న సంకేతాలు ఏమిటని ప్రశ్నించాడు. వీర్‌భద్ర సింగ్ వైఖరి వల్ల దేశ ప్రతిష్ఠ దెబ్బతిన్నదన్నాడు.

డ్రా దిశగా ఇరానీ కప్ మ్యాచ్

ముంబయి, మార్చి 9: రంజీ ట్రోఫీ చాంపియన్ ముంబయి, రెస్ట్ఫా ఇండియా జట్ల మధ్య జరుగుతున్న ఇరానీ కప్ క్రికెట్ మ్యాచ్ డ్రా దిశగా సాగుతున్నది. రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 182 పరుగులకే కుప్పకూలినప్పటికీ, మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యం కారణంగా రెస్ట్ఫా ఇండియా ముందు ముంబయి 480 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచగలిగింది. ఒక వికెట్‌కు రెండు పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో బుధవారం ఉదయం ఆటను కొనసాగించిన ముంబయిని రెస్ట్ఫా ఇండియా బౌలర్లు కట్టడి చేశారు. జయంత్ యాదవ్ 93 పరుగులకు నాలుగు వికెట్లు పడగొట్టాడు. జైదేవ్ ఉనాద్కర్ కేవలం 16 పరుగులకే మూడు వికెట్లు సాధించాడు. స్టువర్ట్ బిన్నీ రెండు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ముంబయి తొలి ఇన్నింగ్స్ స్కోరు 603 పరుగులకు సమాధానంగా మొదటి ఇన్నింగ్స్‌లో 306 పరుగులు చేసిన రెస్ట్ఫా ఇండియా రెండో ఇన్నింగ్స్‌లో ఆచితూచి ఆడుతున్నది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఒక వికెట్‌ను కోల్పోయి 100 పరుగులు చేసింది. ఫయాజ్ ఫైజల్ 41 పరుగులకు అవుట్‌కాగా, శ్రీకర్ భరత్ 42, సుదీప్ చటర్జీ 17 పరుగులతో నాటౌట్‌గా ఉన్నారు.