క్రీడాభూమి

న్యూజిలాండ్ ముమ్మర ప్రాక్టీస్..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాన్పూర్: భారత్, న్యూజిలాండ్ జట్లు గురువారమే కాన్పూర్ చేరుకున్నాయి. ఇక్కడి చల్లని వాతావరణానికి అలవాటు పడేందుకే హడావుడిగా వచ్చాయన్నది వాస్తవం. శుక్రవారం ఇరు జట్ల ఆటగాళ్లు ముమ్మరంగా ప్రాక్టీస్ చేశారు. రొటీన్ వామప్‌తోపాటు, ఫిట్నెస్ కోసం కొద్దిసేపు ఫుట్‌బాల్ ఆడారు. నెట్ ప్రాక్టీస్ కొనసాగించారు. శనివారం, కేన్ విలియమ్‌సన్ నాయకత్వంలో న్యూజిలాండ్ క్రెటర్లంతా ప్రాక్టీస్ సెషన్‌కు హాజరయ్యారు. అయితే, ఇది ఐచ్ఛికమని జట్టు మేనేజ్‌మెంట్ ముందుగానే ప్రకటించడంతో, కెప్టెన్ కోహ్లీ, కీలక ఆటగాళ్లు రోహిత్ శర్మ, జస్‌ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్య ప్రాక్టీస్‌కు హాజరుకాలేదు. ఎడమచేతి వాటం స్పిన్నర్ అక్షర్ పటేల్, ‘చైనామన్’ బౌలర్ కుల్దీప్ యాదవ్ ఒక సెషన్ ముగించి, మధ్యాహ్నం నుంచి నెట్స్‌కు డుమ్మా కొట్టారు. పుణే మ్యాచ్‌లో ఆడిన జట్టును కోహ్లీ యథాతథంగా బరిలోకి దించుతాడా లేక కాన్పూర్ కుల్దీప్ హోం గ్రౌండ్ కావడంతో అతనిని ప్లేయింగ్ ఎలెవెన్‌లోకి తీసుకుంటాడా అన్నది ఆసక్తిని రేపుతున్నది. ఇలావుంటే, లెగ్ స్పిన్నర్ యుజవేంద్ర చాహల్, బ్యాట్స్‌మన్ శిఖర్ ధావన్ మిగతా అందరి కంటే ఎక్కువ సేపు నెట్స్‌లో గడిపారు.
భారత్‌తో పోలిస్తే, కివీస్ క్రికెటర్లే శనివారం ఎక్కువ సేపు మైదానంలో ప్రాక్టీస్ చేస్తూ కనిపించడం విశేషం. కెప్టెన్ విలియమ్‌సన్ స్వయంగా రొటీన్ ప్రాక్టీస్, నెట్స్‌లో దర్శనం ఇవ్వడంతో, మిగతా ఆటగాళ్లు ఉత్సాహంగా అతనిని అనుసరించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ సిరీస్‌ను సాధించాలన్న పట్టుదల వారిలో స్పష్టంగా కనిపించింది.

చిత్రం..ప్రాక్టీస్ సెషన్‌లో కివీస్ ఆటగాళ్లు