క్రీడాభూమి

ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్‌కు శ్రీకాంత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పారిస్, అక్టోబర్ 28: ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ సిరీస్ బాడ్మింటన్ టోర్నమెంట్ పురుషుల విభాగంలో భారత స్టార్ కిడాంబి శ్రీకాంత్ ఫైనల్ చేరుకోగా, తెలుగు తేజం పివి సింధు సెమీ ఫైనల్‌లో ఓటమిపాలైంది. తన సహచరుడు హెచ్‌ఎస్ ప్రణయ్‌ను ఢీకొన్న శ్రీకాంత్ మొదటి సెట్‌ను 14-21 తేడాతో కోల్పోయాడు. అయితే, ఆతర్వాత పుంజుకొని, మిగతా రెండు సెట్లను 21-19, 21-18 ఆధిక్యంతో గెల్చుకున్నాడు. ఫైనల్‌లో అతను జపాన్ క్రీడాకారుడు కెన్టా నిషిమొతోను ఢీ కొంటాడు. సెమీస్‌లో నిషిమొతో 21-17, 21-15 స్కోరుతో ఆండర్స్ ఆంటోనె్సన్‌ను వరుస సెట్లలో ఓడించాడు. మహిళల సింగిల్స్ సెమీ ఫైనల్‌లో అకానే యమాగూచి 21-14, 21-9 తేడాతో సింధుపై విజయం సాధించి ఫైనల్ చేరి, ప్రపంచ నంబర్ వన్ తాయ్ జూ ఇంగ్‌తో టైటిల్ పోరును ఖరారు చేసుకుంది. మరో సెమీ ఫైనల్‌లో ఇంగ్ 21-14, 17-21, 21-8 తేడాతో హి బింజియావోపై గెలిచింది.