క్రీడాభూమి

సిరీస్‌పై కనే్నసిన కివీస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాన్పూర్‌లోని గ్రీన్ పార్క్ స్టేడియంలో ఒక వనే్డ మ్యాచ్ ఫ్లడ్‌లైట్ల వెలుగులో తొలిసారి జరగనుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) వంటి టి-20 టోర్నీలు, సిరీస్‌ల్లో ఇక్కడ డే/నైట్ మ్యాచ్‌లు జరిగాయి. కానీ, వనే్డ ఫార్మాట్‌లో మొదటిసారి మ్యాచ్‌కి గ్రీన్ పార్క్ ఆతిథ్యమివ్వనుంది. వాతావరణం ప్రభావం వికెట్‌పై ఏ విధంగా ఉంటుందో, చలికాలం ఆరంభమైనందున మంచు వల్ల ఆటగాళ్లకు ఎలాంటి సమస్యలు తలెత్తుతాయో అనే ప్రశ్నలు అందరినీ వేధిస్తున్నాయి.
*
కాన్పూర్, అక్టోబర్ 28: మూడు మ్యాచ్‌ల వనే్డ సిరీస్‌ను కైవసం చేసుకొని, భారత్ ఆధిపత్యానికి గండి కొట్టడంపై న్యూజిలాండ్ కనే్నయగా, ఆదివారం నాటి చివరి మ్యాచ్‌లో విజయభేరి మోగిస్తామని విరాట్ కోహ్లీ బృందం ధీమాతో ఉంది. ఈ సిరీస్‌లో మొదటి మ్యాచ్‌ని కివీస్ గెల్చుకోగా, రెండో వనే్డని టీమిండియా సొంతం చేసుకుంది. దీనితో చివరిదైన మూడో వనే్డ ఉత్కంఠ రేపుతున్నది. వరుసగా ఆరు వనే్డ సిరీస్‌లను సాధించిన టీమిండియా ఏడో సిరీస్‌ను ఖాతాలో వేసుకోవడం ఖాయమన్న నమ్మకంతో ఉంది. కెప్టెన్ కోహ్లీసహా పలువురు కీలక ఆటగాళ్లు శనివారం నాటి ప్రాక్టీస్ సెషన్‌కు హాజరుకాకపోవడమే భారత క్రికెటర్ల ఆలోచనా ధోరణికి అద్దం పడుతుంది. చివరి వనే్డలోనూ ఎదురుదాడి చేస్తామని, సులభంగానే విజయాన్ని అందుకుంటామని పుణే వనే్డ ముగిసిన తర్వాత మాట్లాడుతూ కోహ్లీ చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. తొలి మ్యాచ్‌లో విఫలమైన భారత బౌలర్లు పుణేలో అద్భుతంగా రాణించడం విశేషం. ముఖ్యంగా స్ట్రయిక్ బౌలర్లు జస్‌ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్ ఇన్నింగ్స్ ప్రారంభంలోనేగాక, చివరిలోనూ అద్భుతంగా బౌల్ చేసి, న్యూజిలాండ్‌ను కట్టడి చేశారు. ముంబయిలో జరిగిన మొదటి వనే్డను మినహాయిస్తే, ఇటీవల కాలంలో ఆడిన అన్ని మ్యాచ్‌ల్లోనూ గొప్పగా బౌల్ చేస్తున్న వీరిద్దరూ మళ్లీ ఫామ్‌లోకి రావడంతో భారత్‌కు ఊరటనిస్తున్నది. తొలి మ్యాచ్‌లో వికెట్లు పడగొట్టలేకపోయిన యుజువేంద్ర చాహల్ పుణేలో రెండు వికెట్లు సాధించాడు. కుల్దీప్ స్థానంలో జట్టులోకి వచ్చిన అక్షర్ పటేల్ అత్యంత కీలక వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. అజేయ శతకంతో, ఈ సిరీస్‌లో కివీస్ బోణీ చేయడంలో కీలకం భూమిక పోషించిన టాప్ లాథమ్‌ను అతను తక్కువ స్కోరుకే అవుట్ చేయడం భారత్‌కు లాభించింది. విలక్షణమైన బౌలింగ్ యాక్షన్‌ను కలిగిన పార్ట్‌టైమ్ బౌలర్ కేదార్ జాధవ్ ఎనిమిది ఓవర్లు వేసి, కేవలం 31 పరుగులిచ్చాడు. కివీస్ దూకుడుకు అతను అడ్డుకట్ట వేయగలిగాడు. ఇక భారత బ్యాటింగ్ విషయానికి వస్తే, నాలుగో స్థానంలో వచ్చిన దినేష్ కార్తీక్ అజేయంగా 64 పరుగులు సాధించాడు. 2015 వరల్డ్ కప్ తర్వాత జట్టు మేనేజ్‌మెంట్ ఈ స్థానానికి ఏకంగా 11 మందితో ప్రయోగాలు చేసింది. ఎవరూ అనుకున్న రీతిలో ఆడలేకపోయారు. ఆ సమస్యకు దినేష్ కార్తీక్ తెరదించాడనే అనుకోవాలి. ఆరు ఇన్నింగ్స్ తర్వాత శిఖర్ ధావన్ తిరిగి ఫామ్‌లోకి వచ్చి అర్ధ శతకం సాధించడం కూడా భారత్‌కు అనుకూలించే అంశమే. అయితే, ధావన్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను ప్రారంభిస్తున్న రోహిత్ శర్మ ఇంకా వైఫల్యాల బాటలోనే నడుస్తున్నాడు. మొదటి మ్యాచ్‌లో 7 పరుగులు చేసిన అతను రెండో వనే్డలో 20 పరుగులు చేశాడు. అతను మళ్లీ తనదైన శైలిలో రాణిస్తే, న్యూజిలాండ్ బౌలర్లకు ఇబ్బందులు తప్పవు. మొత్తం మీద ఆదివారం నాటి మ్యాచ్‌లో కివీస్‌పై భారత్‌దే పైచేయిగా కనిపిస్తున్నది. కానీ, ప్రత్యర్థిని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదని ముంబయి వనే్డ స్పష్టం చేసిన విషయాన్ని టీమిండియా గుర్తుంచుకోవాలి. ఆ పొరపాట్లు పునరావృతం కాకుండా జాగ్రత్త పడుతూ, పుణే మ్యాచ్ ఫలితానే్న పునరావృతం చేయాలి.
విలయమ్‌సన్ ఫామ్‌పై ఆందోళన
కెప్టెన్ కేన్ విలియమ్‌సన్ ఫామ్‌పైనే కివీస్ శిబిరంలో ఆందోళన వ్యక్తమవుతున్నది. ముంబయి వాంఖడే స్టేడియంలో జరిగిన మొదటి వనే్డలో ఓపెనర్లు మార్టిన్ గుప్టిల్ 32, కొలిన్ మున్రో 28 పరుగులు చేసి అవుట్‌కాగా, విలియమ్‌సన్ కేవలం ఆరు పరుగులకే పెవిలియన్ చేరాడు. టామ్ లాథమ్ (103 నాటౌట్), (రాస్ టేలర్ 95) ఆదుకోకపోతే కివీస్ పరిస్థితి దారుణంగా ఉండేది. ప్రతిసారీ ఈ విధంగా ఒకరిద్దరు ఆదుకొని, జట్టును గెలిపించడం సాధ్యం కాదని పుణే మ్యాచ్ నిరూపించింది. గుప్టిల్ (11), మున్రో (10) తక్కువ స్కోర్లకే వెనుదిరగ్గా, విలియమ్‌సన్ మరింత దారుణంగా ఆడి, మూడు పరుగులకే అవుటయ్యాడు. మొదటి వనే్డలో ఆదుకున్న రాస్ టేలర్ (21), టామ్ లాథమ్ (38) కూడా రెండో వనే్డలో అదే స్థాయిలో ఆడలేకపోయారు. హెన్రీ నికోల్స్ 42 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిస్తే, కొలిన్ డి గ్రాండ్‌హోమ్ 41 పరుగులు చేశాడు. అయితే, వీరిద్దరి శ్రమ రెండో వనే్డలో కివీస్ ఓటమిని అడ్డుకోలేకపోయింది. సమష్టి కృషి లేకపోతే విజయాలు సాధించడం అసాధ్యమన్న వాస్తవాన్ని కివీస్ గుర్తించాలి. విలియమ్‌సన్ ఫామ్‌లోకి వస్తేగానీ ఆ జట్టు పరిస్థితి మెరుగు పడదు. సిరీస్‌పై కనే్నసిన ఈ జట్టు రెండో వనే్డలో దొర్లిన పొరపాట్లను సరిదిద్దుకుంటే, కీలకమైన చివరి మ్యాచ్‌లో టీమిండియాకు గట్టిపోటీని ఇవ్వగలుగుతుంది.
మ్యాచ్ ఆదివారం మధ్యాహ్నం 1.30 గంటలకు మొదలవుతుంది.