క్రీడాభూమి

మాలీపై గెలిచిన బ్రెజిల్‌కు మూడో స్థానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా: ఈసారి అండర్-17 వరల్డ్ కప్ గెల్చుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్న జట్టుగా బరిలోకి దిగిన బ్రెజిల్ చివరికి మూడో స్థానంతో సంతృప్తి చెందాల్సి వచ్చింది. శనివారం జరిగిన క్లాసిఫికేషన్ మ్యాచ్‌లో ఈ జట్టు 2-0 తేడాతో మాలీని ఓడించింది. మ్యాచ్ మొదలైన క్షణం నుంచే ఇరు జట్లు రక్షణాత్మక విధానాన్ని అనుసరించడంతో, ప్రథమార్ధంలో గోల్స్ నమోదు కాలేదు. రెండు జట్లకూ రెండుమూడు పర్యాయాలు గోల్ చేసే అవకాశాలు తృటిలో తప్పిపోయాయి. ద్వితీయార్థంలో మాలీ అదే ఎత్తుగడను అనుసరించింది. నిర్ణీత సమయంలో ఒక్క గోల్ కూడా రాకపోతే, పెనాల్టీ షూటౌట్ అనివార్యమవుతుందని, అందులో అదృష్టాన్ని పరీక్షించుకోవచ్చన్నది మాలీ వ్యూహంగా కనిపించింది. అయితే, బ్రెజిల్ క్రమంగా తన ఆటతీరును మార్చింది. దాడులకు ఉపక్రమించింది. డిఫెన్స్‌కే కట్టుబడకుండా, అవకాశం లభించిన ప్రతిసారీ ప్రత్యర్థి గోల్ పోస్టును లక్ష్యంగా చేసుకొని దూకుడును కొనసాగించింది. 55వ నిమిషంలో ఆ జట్టు ప్రయత్నం అలాన్ ద్వారా ఫలించింది. అతను చేసిన అద్భుతమైన ఫీల్డ్ గోల్ బ్రెజిల్‌ను ఆధిక్యంలో నిలబెట్టింది. ఆ తర్వాత కూడా ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచింది. మాలీ అడపాదడపా గోల్స్ కోసం చేసిన ప్రయత్నాలను బ్రెజిల్ గోల్‌కీపర్ గాబ్రియల్ బ్రజావో సమర్థంగా అడ్డుకున్నాడు. మాలీ ఆటగాడు మహమానే టౌరే అద్భుతమైన హెడర్‌తో బంతిని గోల్‌లోకి పంపేందుకు ప్రయత్నించాడు. కానీ, బంతి గోల్ పోస్టుకు తగిలి వెనక్కు వెళ్లడంతో, అతని కృషి విఫలమైంది. ముమ్మర పోరు కొనసాగుతున్న తరుణంలోనే, 88వ నిమిషంలో యురీ అల్బెర్టొ గోల్ చేసి, బ్రెజిల్‌కు 2-0 ఆధిక్యాన్ని సంపాదించిపెట్టాడు. ఆతర్వాత మాలీని గోల్ చేయకుండా అడ్డుకోగలిగిన బ్రెజిల్ అదే తేడాతో విజయం సాధించి, మూడో స్థానాన్ని దక్కించుకుంది. టైటిల్ గెలవలేకపోయనా, కొంతలో కొంత పరువు నిలబెట్టుకుంది.