క్రీడాభూమి

పర్‌దీప్ టాప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై: రెయిడ్‌తోపాటు మొత్తం పాయింట్లలోనూ పాట్నా పైరేట్స్ కెప్టెన్ పర్‌దీప్ నర్వాల్ అగ్రస్థానాన్ని ఆక్రమించాడు. అతను మొత్తం 350 పాయింట్లు సాధించగా, అవన్నీ రెయిడ్ పాయింట్స్ కావడం విశేషం. రోహిత్ కుమార్ (మొత్తం 231, రెయిడ్ 219 పాయింట్లు), అజయ్ ఠాకూర్ (మొత్తం 222, రెయిడ్ 213 పాయింట్లు) వరుసగా రెండు, మూడు స్థానాలను దక్కించుకున్నారు. టాకిల్‌లో సురేందర్ నడా నంబర్ వన్‌గా నిలిచాడు. అతను మొత్తం 80 టాకిల్ పాయింట్లు సంపాదించగా, సుర్జీత్ సింగ్ 76, విశాల్ భరద్వాజ్ 66 ద్వితీయ, తృతీయ స్థానాల్లో ఉన్నారు. విజయవంతమైన టాకిల్స్ విభాగంలో సరేందర్ నడా 74 పాయింట్లతో నంబర్ వన్ స్థానాన్ని ఆక్రమించాడు. సుర్జీత్ సింగ్ (72 పాయింట్లు), విశాల్ భరద్వాజ్ (68 పాయింట్లు) వరుసగా రెండు, మూడు స్థానాలను సంపాదించారు. సూపర్ టాకిల్‌లో జీవ్ కుమార్ ఏడు పాయింట్లు చేశాడు. సురేందర్ నాడా, అమిత్ హూడా, కుల్దీప్ సింగ్, సోమ్‌వీర్ తలా ఆరేసి పాయింట్లు చేశారు. హై ఫైవ్స్‌లో సురేందర్ నడా, సుర్జీత్ సింగ్ చెరి తొమ్మిది పాయింట్లతో నంబర్ వన్ స్థానాన్ని పంచుకుంటున్నారు. గిరీష్ మారుతి ఎర్నాక్, విశాల్ భరద్వాజ్ చెరి ఐదు పాయింట్లు చేసి, సంయుక్తంగా రెండో స్థానాన్ని సంపాదించారు. జైదీప్ ఆరు హైఫైవ్స్‌తో మూడో స్థానంలో ఉన్నాడు. మొత్తం మీద సూపర్ స్టార్ ఇమేజ్‌ను తెచ్చుకున్న పర్‌దీప్ నర్వాల్ తన స్థాయకి తగి నట్టుగానే ఆడాడు. తనకు తానే సాటి అని నిరూపించుకున్నా డు. హర్యానా స్టీలర్స్‌తో జరిగిన మ్యాచ్లో అతను ఏకంగా 34 పాయంట్లు సాధించి సంచలనం సృష్టించాడు. ఆ మ్యచ్‌లో హర్యానా 30 పాయంట్లు మాత్రమే చేయడం గమనార్హం.