క్రీడాభూమి

ఇంగ్లాండ్ తొలిసారి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, అక్టోబర్ 28: సాల్ట్ లేక్ స్టేడియంలో శనివారం జరిగిన ఫైనల్‌లో స్పెయిన్‌పై 5-2 తేడాతో సంచలన విజయాన్ని నమోదు చేసిన ఇంగ్లాండ్ టైటిల్ సాధించింది. ఈ టోర్నీలో ఇంగ్లాండ్ విజేతగా నిలవడం ఇదే మొదటిసారి. నిజానికి మ్యాచ్ ఆరంభంలో స్పెయిన్ ఆధిక్యాన్ని కనబరచింది. సెర్గియో గోమెజ్ దూకుడుగా ఆడుతూ 10వ నిమిషంలోనే గోల్ చేశాడు. ఇంగ్లాండ్ కుదుటపడక ముందే మరోసారి దాడులను ఉద్ధృతం చేశాడు. ఫలితంగా 31వ నిమిషంలో మరో గోల్ నమోదైంది. 2-0 ఆధిక్యాన్ని సంపాదించిన తర్వాత స్పెయిన్ వ్యూహాత్మకంగా డిఫెన్స్‌కు ప్రాధాన్యం ఇవ్వగా, ఇంగ్లాండ్ ఆటగాళ్లు సర్వశక్తులు ఒడ్డి పోరాటం సాగించారు. 44వ నిమిషంలో స్టార్ ఆటగాడు రియాన్ బ్రూస్టర్ ద్వారా ఇంగ్లాండ్‌కు మొదటి గోల్ లభించింది. మరో 14 నిమిషాల్లో గిబ్స్ వైట్ ద్వారా ఆ జట్టు ఈక్వెలైజర్‌ను సంపాదించుకుంది. స్కోర్లు సమం కావడంతో, ఎలాంటి ఒత్తిడి లేకుండా ఇంగ్లాండ్ ముమ్మర దాడులకు ఉపక్రమించింది. ఫిలిఫ్ ఫర్డెన్ 69, మార్క్ గూహి 84 నిమిషాల్లో గోల్స్ చేసి, జట్టుకు 4-2 ఆధిక్యాన్ని అందించారు. ఆతర్వాత కూడా అదే ఊపుతో ఆడిన ఇంగ్లాండ్‌కు 88వ నిమిషంలో ఫర్డెన్ గోల్‌ను సాధించిపెట్టాడు. అతని ఖాతాలో రెండో గోల్ చేసింది. 5-2తో ముందంజలో ఉండడంతో, మిగతా సమయాన్ని రక్షణాత్మకంగా ఆడిన ఇంగ్లాండ్, అదే తేడాతో విజయభేరి మోగించింది. మొదటిసారి అండర్-17 ప్రపంచ టైటిల్‌ను అందుకుంది.

చిత్రం.. అండర్-17 సాకర్ వరల్డ్ కప్ గెల్చుకున్న ఇంగ్లాండ్ క్రీడాకారుల ఆనందం