క్రీడాభూమి

పాట్నా హ్యా ట్రిక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రో కబడ్డీని 2014లో మొదలుపెట్టినప్పుడు, జైపూర్ పింక్ పాంథర్స్ తొలి విజేతగా అవతరించింది. 2015లో యు ముంబా టైటిల్ దక్కించుకుంది. గత ఏడాది జనవరిలో మూడవ, తిరిగి జూన్‌లో నాలుగవ టోర్నీలను నిర్వహించారు. జనవరిలో డిఫెండింగ్ చాంపియన్ యు ముంబాను 36-30 ఆధిక్యంతో ఓడించి, పాట్నా మొదటిసారి టైటిల్ సాధించింది. జూన్‌లో ఇదే జట్టు జైపూర్ పింక్ పాంథర్స్‌పై 37-29 తేడాతో గెలిచింది. ఇప్పుడు గుజరాత్‌పై విజయం సాధించి, ఐదో ప్రో కబడ్డీ టైటిల్‌ను అందుకుంది. ఈసారి మ్యాచ్‌లన్నీ పోటాపోటీగా సాగడం విశేషం. తమిళ్ తలైవాస్ వంటి సాధారణ జట్లు కూడా గొప్ప పోరాట పటిమతో ప్రేక్షకులను, అభిమానులను ఆకట్టుకున్నాయ. పాట్నా తన స్థాయకి తగినట్టే ఆడి, చివరికి టైటిల్‌ను సాధించింది.
చెన్నై, అక్టోబర్ 28: ప్రో కబడ్డీ లీగ్‌ను డిఫెండింగ్ చాంపియన్ పాట్నా పైరేట్స్ గెల్చుకుంది. వరుసగా మూడోసారి విజయ కేతనాన్ని ఎగురవేసి, హ్యాట్రిక్ నమోదు చేసింది. శనివారం జరిగిన ఫైనల్‌లో గుజరాత్ ఫార్ట్యూన్‌జెయింట్స్‌ను 55-38 తేడాతో ఓడించి సత్తా చాటింది. ‘జెయింట్ కిల్లర్’గా గుజరాత్ ముద్ర వేయించుకుంటే, పాట్నా నిలకడగా రాణిస్తూ టైటిల్‌ను నిలబెట్టుకునే మార్గంలో ముందడుగు వేసింది. ఈ రెండు జట్లు ఫైనల్ చేరినప్పుడు హోరాహోరీ పోరు తప్పదన్న అభిప్రాయం వ్యక్తమైంది. కానీ, పాట్నా పూర్తి ఆధిపత్యాన్ని కనబరచగా, గట్టిపోటీని ఇవ్వడానికి ప్రయత్నించి విఫలమైన గుజరాత్ 17 పాయింట్ల తేడాతో పరాజయాన్ని చవిచూసింది. ఈ టోర్నీ మొత్తంలో ఒంటి చేత్తో జట్టును గెలిపిస్తూ వచ్చిన పాట్నా కెప్టెన్, స్టార్ ఆటగాడు పర్‌దీప్ నర్వాల్ ఫైనల్‌లోనూ అదే దూకుడును కొనసాగించి 19 పాయింట్లు సాధించడం విశేషం. మోనూ గోయత్ 9 పాయింట్లు చేశాడు. విజయ్ 7, జైదీప్ 5 చొప్పున పాయింట్లు నమోదు చేసి, పాట్నా విజయానికి తమ వాటాను అందించారు. కాగా, గుజరాత్ తరఫున సచిన్ ఒక్కడే కొంత వరకూ పోరాటాన్ని కొనసాగించి, 11 పాయింట్లు సాధించాడు. మిగతా ఆటగాళ్లు విఫలంకాగా, సబ్‌స్టిట్యూట్స్‌గా వచ్చిన మహేంద్ర రాజ్‌పుత్ 5, చంద్రన్ రంజిత్ 4 చొప్పున పాయింట్లు చేయడం గమనార్హం.