క్రీడాభూమి

బార్సిలోనా దూకుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాడ్రిడ్, అక్టోబర్ 29: స్పానిష్ సాకర్ లీగ్ లా లిగాలో బార్సిలోనా తిరుగులేని ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్నది. అథ్లెటికో బిల్బావోతో జరిగిన మ్యాచ్‌ని 2-0 తేడాతో సొంతం చేసుకుంది. ఇప్పటి వరకూ ఈ సీజన్‌లో 13 లా లిగా మ్యాచ్‌లు ఆడిన బార్సిలోనాకు ఇది 12వ విజయం. ఒక మ్యాచ్‌ని డ్రా చేసుకుంది. 36వ నిమిషంలో మెస్సీ గోల్ సాధించగా, ఆతర్వాత దాదాపు చివరి వరకూ బార్సిలోనా రక్షణాత్మక విధానాన్ని అనుసరించింది. ఫలితంగా బిల్బావో ఒక్క గోల్ కూడా చేయలేకపోయింది. ఇంజురీ టైమ్‌లో పాలిన్హో ద్వారా బార్సిలోనాకు మరో గోల్ లభించింది. బార్సిలోనా ఎలాంటి ఇబ్బంది లేకుండా విజయాన్ని నమోదు చేసింది.
ఇలావుంటే, ఇతర మ్యాచ్‌ల్లో, అలావెస్‌పై వలెన్షియా 2-1 తేడాతో గెలిచింది. అదే విధంగా లెగానెస్‌ను సెవిల్లా 2-1 ఆధిక్యంతోనే ఓడించింది. రియల్ సోసియాడ్‌పై గెటాఫే కూడా అదే స్కోరుతో విజయాన్ని నమోదు చేయడం గమనార్హం. అథ్లెటికో మాడ్రిడ్, విల్లా రియల్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఇరు జట్లు చెరి ఒక గోల్ చేశాయి.

చిత్రం..మెస్సీ