క్రీడాభూమి

జాషువాకే టైటిల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కార్డ్ఫి (యునైటెడ్ కింగ్‌డమ్), అక్టోబర్ 29: నాకౌట్లతో ప్రత్యర్థులను ఓడించడంలో నూరు శాతం మార్కులను కొట్టేసిన ఆంథోనీ జాషువా మరోసారి సత్తా చాటాడు. అంతర్జాతీయ బాక్సింగ్ సమాఖ్య (ఐబిఎఫ్), ప్రపంచ బాక్సింగ్ సంఘం (డబ్ల్యుబిఎ) సంయుక్త హెవీవెయిట్ టైటిల్‌ను నిలబెట్టుకున్నాడు. చాలెంజర్ కార్లొస్ టకామ్‌ను 10 రౌండ్లలో చిత్తుచేశాడు. కెరీర్‌లో అతనికి ఇది వరుసగా 20వ టైటిల్ కావడం విశేషం. అప్పటికే బలమైన గాయాలు తగలడంతో ముఖంపై రక్తం కారుతున్న టకామ్ పదో రౌండ్‌లో కిందపడిపోయాడు. అయితే, చివరి క్షణాల్లో లేచి నిలబడిన అతను పోరాటాన్ని కొనసాగించాలని కోరినప్పటికీ, ముందు జాగ్రత్తగా రిఫరీ ఫైట్‌ను పదో రౌండ్ వద్ద నిలిపివేయడంతో ప్రేక్షకులు గొడవకు దిగారు. జాషువాను గేలిచేశారు. టకామ్‌ను నిజయమైన వీరుడిగా, విజేతగా అభివర్ణిస్తూ నినాదాలు చేశారు. అయితే, తన నిర్ణయాన్ని మార్చుకోని రిఫరీ ఫైట్‌ను కొనసాగించడానికి విముఖత వ్యక్తం చేస్తూ, జాషువాను విజేతగా ప్రకటించాడు.

చిత్రం..కార్లొస్ టామ్‌పై బలమైన పంచ్ విసిరిన ఆంథోనీ జాషువా (కుడి)