క్రీడాభూమి

సూపర్ శ్రీకాంత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పారిస్, అక్టోబర్ 29: ఎనిమిదో సీడ్‌గా ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ సిరీస్ బాడ్మింటన్ టోర్నీలో బరిలోకి దిగిన హైదరాబాదీ కిడాంబి శ్రీకాంత్ టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. ఇక్కడ జరిగిన ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ సిరీస్ బాడ్మింటన్ టోర్నీ పురుషుల సింగిల్స్ ఫైనల్‌లో కెన్టా నిషిమొటోను 21-14, 21-13 తేడాతో ఓడించి వరుసగా రెండో టైటిల్ అందుకున్నాడు. గత వారం ఒడెన్స్‌లో జరిగిన డెన్మార్క్ ఓపెన్‌ను శ్రీకాంత్ సాధించాడు. ఈ సీజన్‌లో ఇప్పటికీ మూడు సూపర్ సిరీస్ టైటిళ్లను గెల్చుకొని హ్యాట్రిక్ సాధించిన అతను అదే ఖాతాలో మరో టైటిల్‌ను వేసుకున్నాడు. ఒక క్యాలండర్ ఇయర్‌లో నాలుగు సూపర్ సిరీస్ టోర్నీల్లో పతకాలు సాధించిన నాలుగో ఆటగాడిగా రికార్డు పుస్తకాల్లో చోటు సంపాదించాడు. కాగా, మహిళల సింగిల్స్‌లో ప్రపంచ నంబర్ వన్ తాయ్ జూ ఇంగ్ విజేతగా నిలిచింది. ఫైనల్‌లో ఆమె అకానే యమాగూచీని 21-4, 21-16 ఆధిక్యంతో సునాయాసంగా ఓడించింది. మహిళల డబుల్స్ విభాగంలో గ్రేసియా పొలీ, అప్రియాని రహాయా జోడీ 21-12, 21-15 ఆధిక్యంతో లీ సో హీ, షిన్ సియాంగ్ చాన్ జోడీపై గెలిచింది. మిక్స్‌డ్ డబుల్స్‌లో జెంగ్ సివెయ్, చెన్ క్వింగ్‌చెన్ జోడీపై 22-20, 21-15 స్కోరుతో విజయం సాధించిన టౌతొవి అహ్మద్, లిలియానా నస్టర్ జోడీ ట్రోఫీని అందుకుంది.

చిత్రం..కిడాంబి శ్రీకాంత్