క్రీడాభూమి

గేల్ గెలిచాడు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిడ్నీ, అక్టోబర్ 30: వెస్టిండీస్ స్టార్ క్రికెటర్ క్రిస్ గేల్ వేసిన పరువు నష్టం కేసుపై సిడ్నీ కోర్టు సానుకూలంగా స్పందించింది. ఒక పాత్రికేయురాలితో అసభ్యంగా ప్రవర్తించాడని, ఆమెకు మర్మాంగాన్ని చూపుతూ వెకిలిగా మాట్లాడాడని గేల్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఫెయిర్ ఫాక్స్ వార్తా సంస్థ ఇచ్చిన ఈ సమాచారాన్ని ఆస్ట్రేలియాలోని వివిధ వార్తా పత్రికలు ప్రముఖంగా ప్రచురించాయి. యితే తనపై వచ్చిన ఆరోపణలను గేల్ ఖండించాడు. తన ప్రతిష్ఠను దిగజార్చే రీతిలో అవాస్తవ కథనాన్ని ప్రచారం చేసిన ఫెయిర్ ఫాక్స్ తనకు నష్ట పరిహారం చెల్లించాలని కోర్టులో కేసు వేశాడు. కాగా, గేల్ అనుచితంగా ప్రవర్తించినట్టు ఆధారాలను ప్రతివాదులు సమర్పించలేకపోయినట్టు కోర్టు అభిపాయపడింది. గేల్‌కు అనుకూలంగా తీర్పునిచ్చింది. అయితే, నష్టపరిహారం ఎంతకు ఖరారైందో ఇంకా తెలియరాలేదు.

చిత్రం..క్రిస్ గేల్