క్రీడాభూమి

టాప్ ర్యాంక్‌పై ఆందోళనేమీ లేదు: శ్రీకాంత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పారిస్, అక్టోబర్ 30: ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్‌పై తనకు ఏమాత్రం ఆందోళన లేదని, దానిని గురించి ఎక్కువగా ఆలోచించి నిద్రను పాడుచేసుకోనని భారత బాడ్మింటన్ స్టార్ కిడాంబి శ్రీకాంత్ స్పష్టం చేశాడు. ఫ్రెంచ్ ఓపెన్ బాడ్మింటన్ టైటిల్ గెల్చుకున్న అతను ఈ ఏడాది నాలుగో సూపర్ సిరీస్ విజయాన్ని నమోదు చేయడం విశేషం. ఈ ఘనతను అందుకున్న తొలి భారతీయుడిగా, ప్రపంచంలోనే నాలుగో క్రీడాకారుడిగా అతను రికార్డులకెక్కాడు. వారం రోజుల వ్యవధిలో రెండు టైటిళ్లు సాధించిన అతను తాజా ప్రపంచ ర్యాంకింగ్స్‌లో మెరుగైన స్థానాన్ని ఆక్రమించడం ఖాయం. ప్రస్తుతం ఎనిమిదో స్థానంలో ఉన్న అతను ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, తాను ఎన్ని స్థానాలు ముందుకు వెళతానో చెప్పలేనని అన్నాడు. ఏఏ స్థానం వచ్చినా, నంబర్ వన్ కోసం ప్రయత్నిస్తారా? అన్న ప్రశ్నపై స్పందిస్తూ, ఆ విషయం గురించి ఆలోచించనని అన్నాడు. ప్రస్తుత ప్రపంచ నంబర్ వన్ విక్టర్ అక్సెల్సెన్ తన కంటే ఎంతో ముందున్నాడని, కాబట్టి, అతనిని అధిగమించి తనకు నంబర్ వన్ స్థానం దక్కుతుందని అనుకోవడం లేదని శ్రీకాంత్ చెప్పాడు. ఇటీవల కాలంలో తన ఆటతీరు సంతృప్తికరంగా ఉందని, సాధ్యమైనంత వరకూ ఇదే ఫామ్‌ను కొనసాగించడానికి కృషి చేస్తానని తెలిపాడు.

చిత్రం..కిడాంబి శ్రీకాంత్