క్రీడాభూమి

విజేత రైల్వే స్పోర్ట్స్ బోర్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం (స్పోర్ట్స్), అక్టోబర్ 30: రెండో ఎలైట్ జాతీయ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌ను రైల్వే స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డు జట్టు కైవసం చేసుకుంది. ఈ పోటీల్లో రైల్వే జట్టు 5 స్వర్ణాలు, 1 కాంస్య పతకంతో మొత్తం 49 పాయింట్లు సాధించి ప్రథమ స్థానం గెలుచుకోగా, సర్వీసెస్ జట్టు 4 స్వర్ణాలు, ఒక రజతం, 2 కాంస్య పతకాలతో 40 పాయింట్లు సాధించి రన్నరప్ ట్రోఫీని గెలుచుకుంది. హర్యానా జట్టు 1 స్వర్ణం, 1 రజతం, 2 కాంస్య పతకాలతో మూడో స్థానంలో నిలిచింది. ఇక్కడి స్వర్ణ్భారతి స్టేడియంలో సోమవారం జరిగిన 60 కిలోల కేటగిరిలో అర్జున అవార్డు గ్రహీత, జాతీయ పోటీల్లో తిరుగులేని ఆధిక్యతతో చాంపియన్‌గా నిలుస్తూ వస్తున్న అసోం బాక్సర్ శివథాపా ఈ పోటీల్లో సర్వీసెస్ బాక్సర్ల చేతిలో ఓటమి చవిచూడడం అందర్నీ ఆశ్చర్యపరచింది. ఈ పోటీల్లో అంతర్జాతీయ బాక్సర్‌తో తలపడుతున్నానన్న జంకు లేకుండా సర్వీసెస్ బాక్సర్ మనీష్ కౌశిక్, శివథాపాతో తలపడిన తీరు అందర్నీ ఆకట్టుకుంది. కౌశిక్ ఈ బౌట్‌లో 4-1 స్కోరుతో శివథాపాపై విజయం సాధించాడు. ఈ పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన కామన్‌వెల్త్ గోల్డ్ మెడలిస్ట్ మనోజ్‌కుమార్ (రైల్వే) బెస్ట్ బాక్సర్ అవార్డును గెలుచుకోగా, బెస్ట్ చాలెంజర్ బాక్సర్‌గా లాల్ బియాకిమ్(మిజోరం), మోస్ట్ ప్రామిసింగ్ బాక్సర్‌గా మనీష్ కౌశిక్ (సర్వీసెస్) అవార్డులు అందుకున్నారు. పోటీల అనంతరం జరిగన ముగింపు ఉత్సవానికి ఈస్ట్‌కోస్ట్ రైల్వే జనరల్ మేనేజర్ ఉమేష్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు ట్రోఫీలను అందజేశారు.

చిత్రం..ఎలైట్ జాతీయ బాక్సింగ్ చాంపియన్‌షిప్ గెలుచుకున్న రైల్వే స్పోర్ట్స్ బోర్డు జట్టుకు ట్రోఫీని అందజేస్తున్న ఈస్ట్‌కోస్ట్ రైల్వే జనరల్ మేనేజర్ ఉమేష్ సింగ్