క్రీడాభూమి

ఆర్చర్‌కు గుచ్చుకున్న బాణం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బోల్పూర్, అక్టోబర్ 30: ప్రాక్టీస్ జరుగుతున్న సమయంలో ఒక ఆర్చర్ భుజానికి బాణం గుచ్చుకుంది. గాయపడిన ఆమె ప్రస్తుతం ఆసుపత్రిలో కోలుకుంటున్నది. జెవెల్ షేక్ అనే ఆర్చర్ ప్రాక్టీస్ సమయంలో వేసిన బాణం గురితప్పి, 14 ఏళ్ల ఫైజిలా ఖటూన్ అనే మరో ఆర్చర్ భుజానికి తగిలింది. తొలుత మెడకు గాయమైందని అంతా అనుకున్నారు. అయితే, భుజం ఎముక పక్కన బాణం గుచ్చుకుందని భారత క్రీడా ప్రాధికార సంస్థ (సాయ్) సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. ఇది ప్రమాద వశాత్తు జరిగిన తప్పిదమేగానీ, ఎవరి పొరపాటు లేదని స్పష్టం చేసింది. ఫైజిలా ఆసుపత్రిలో కోలుకుంటున్నదని తెలిపింది.