క్రీడాభూమి

లక్ష్మణ్, రాజు దిగ్భ్రాంతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 30: బిసిసిఐకి జనరల్ మేనేజర్‌గా బాధ్యతలు నిర్వర్తించిన ఎంవి శ్రీధర్ హఠాన్మరణంపై భారత మాజీ క్రికెటర్లు వివిఎస్ లక్ష్మణ్, వెంకటపతి రాజు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హైదరాబాద్‌కు చెందిన వీరిద్దరికీ శ్రీధర్‌తో ఎంతో సాన్నిహిత్యం ఉంది. అతని మృతి వార్త తనను కలచివేసిందని లక్ష్మణ్ వాపోయాడు. హైదరాబాద్ క్రికెట్‌కు గుర్తింపు తీసుకొచ్చిన క్రికెటర్లలో శ్రీధర్ ప్రముఖుడని అభివర్ణించాడు. హైదరాబాద్ జట్టుకు తామిద్దరం కలిసి ఆడిన రోజులు గుర్తుకొస్తున్నాయని రాజు తన సంతాప ప్రకటనలో తెలిపాడు. రంజీ ట్రోఫీ తదితర టోర్నీలో తాము కలిసి ఆడామని, ఒకే గదిలో ఉండేవాళ్లమని తెలిపాడు. శ్రీధర్ మృతి తమకు పూడ్చలేని లోటని వ్యాఖ్యానించాడు. హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సిఎ) అధ్యక్షుడు వివేకానంద తదితరులు కూడా శ్రీధర్ మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు.
ఆపరేషన్స్ విభాగం జనరల్ మేనేజర్‌గా శ్రీధర్ విశిష్ట సేవలు అందించాడని బిసిసిఐ ఒక ప్రకటనలో తెలిపింది. 2013 నుంచి గత నెల వరకూ అతను తమతో కలిసి ఉన్న విషయాన్ని ప్రస్తావించింది. హెచ్‌సిఎ కార్యదర్శిగా, ఉపాధ్యక్షుడిగా కూడా అతను గొప్పగా సేవలు అందించాడని పేర్కొంది. అతని మృతి వార్త అందరినీ ఆశ్చర్యానికి గురి చేసిందని తెలిపింది. సౌరాష్ట్ర క్రికెట్ సంఘం (ఎస్‌సిఎ), తమిళనాడు క్రికెట్ సంఘం (టిఎన్‌సిఎ) తదితర క్రికెట్ సంఘాలు కూడా శ్రీదర్ మృతికి సంతాపం ప్రకటించాయ.
తెలంగాణ ముఖ్య మంత్రి కె. చంద్రశేఖర్ రావుసహా పలువురు రాజీకీయ నాయకులు, ప్రముఖులు శ్రీదర్ ఆత్మకు శాంతి కలగాలని తమతమ ప్రకటనల్లో ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరూ అతని సేవలను గుర్తుచేసుకున్నారు. క్రికెటర్‌గా, అధికారిగా హైదరాబాద్, జాతీయ క్రికెట్‌కు అతను విశిష్ట సేవలు అందించాడని కొనియాడారు. శ్రీధర్‌తో కలిసి క్రికెట్ ఆడిన, అతను హెచ్‌సిఎలో కీలకంగా ఉన్న సమయంలో క్రికెటర్లుగా ఎదిగిన పలువురు ఆటగాళ్లు కూడా వేరువేరు ప్రకటనల్లో సంతాపం వ్యక్తం చేశారు. శ్రీదర్ మృతి యావత్ క్రికెట్ ప్రపంచానికి తీరని లోటని పేర్కొన్నారు.