క్రీడాభూమి

బిసిసిఐ మాజీ జనరల్ మేనేజర్ శ్రీ్ధర్ హఠాన్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 30: భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) మాజీ జనరల్ మేనేజర్ డాక్టర్ ఎంవి శ్రీ్ధర్ గుండెపోటుతో మృతి చెందాడు. సుమారు నాలుగు సంవత్సరాలు బిసిసిఐ జనరల్ మేనేజర్ (ఆపరేషన్స్)గా సేవలు అందించిన శ్రీ్ధర్ గత నెల తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. సోమవారం మధ్యాహ్నం భోజనానికి వెళుతుండగా, గుండెపోటు ఉద్ధృతంగా రావడంతో అక్కడే కుప్పకూలి మృతి చెందాడు. 1990 దశకంలో హైదరాబాద్ క్రికెట్‌కు మూల స్తంభంగా నిలిచిన శ్రీ్ధర్ మృతి పట్ల పలువురు మాజీ, ప్రస్తుత క్రికెటర్లు, అధికారులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అప్పట్లో మహమ్మద్ అజరుద్దీన్ జాతీయ జట్టులో బిజీగా ఉండడంతో, హైదరాబాద్, సౌత్ జోన్ జట్ల ఇన్నింగ్స్‌ను అబ్దుల్ అజీంతో కలిసి శ్రీ్ధర్ ప్రారంభించేవాడు. కెరీర్‌లో 97 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడిన అతను 48.91 సగటుతో 6,701 పరుగులు సాధించాడు. అతని అత్యధిక స్కోరు 366 పరుగులు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో అపారమైన అనుభవం ఉన్న కారణంగా, అధికారుల నుంచి క్రికెటర్లు ఏం కోరుకుంటారన్నది అతనికి బాగా తెలుసు. అదే విధంగా క్రికెటర్లతో ఏ విధంగా వ్యవహరించాలో కూడా శ్రీ్ధర్‌కు తెలుసు. అందుకే, ఎన్నో సంక్లిష్టమైన సమయాల్లో బిసిసిఐ అతనిపేనే ఆధారపడేది. భారత స్పిన్నర్ హర్భజన్ సింగ్, ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ ఆండ్రూ సైమాండ్స్ మధ్య ‘మంకీగేట్’ ఉదంతంగా ప్రసిద్ధి చెందిన ఘర్షణ జరిగినప్పుడు టీమిండియా మేనేజర్‌గా అతను చురుగ్గా వ్యవహరించాడు. సమస్య మరింత పెద్దది కాకుండా చూడడంలో కీలక పాత్ర పోషించాడు. క్రికెటర్లకు, బోర్డు అధికారులకు మధ్య వారధిగా విశిష్ట సేవలు అందించిన శ్రీ్ధర్‌కు గొప్ప వ్యూహకర్తగా మంచి పేరు ఉంది. చీఫ్ కోచ్ అనిల్ కుంబ్లే రాజీనామా చేయడంతో, అప్పట్లో వెస్టిండీస్ పర్యటనకు వెళ్లిన టీమిండియాతో శ్రీ్ధర్ అక్కడికి వెళ్లాడు. సంజయ్ బంగార్ కోచ్‌గా విధులు నిర్వర్తించగా, కోచ్ లేడన్న కారణంగా ఆటగాళ్లు ఒత్తిడికి గురికాకుండా చూసే బాధ్యతను బోర్డు అధికారులు శ్రీ్ధర్‌కు అప్పచెప్పారు. హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సిఎ)కు కార్యదర్శిగా కూడా వ్యవహరించిన శ్రీ్ధర్‌పై ఆరోపణలు కూడా లేకపోలేదు. హెచ్‌సిఎకు అనుబంధంగా అతనికి చెందిన పలు క్రికెట్ క్లబ్‌లు ఉన్నాయన్న ఆరోపణ వాటిలో ఒకటి. పరస్పర ప్రయోజనాలు కలిగించే అంశాలు ఏవీ ఉండకూడదని సుప్రీం కోర్టు జారీ చేసిన ఆదేశాలను అనుసరించి, హెచ్‌సిఎ అనుబంధ క్లబ్‌ల వివరాలు, వాటితో ఉన్న సంబంధాల గురించి వివరణ ఇవ్వాల్సిందిగా శ్రీ్ధర్‌ను బిసిసిఐ కోరింది. అయితే, ఆ వివరాలను వెల్లడించడానికి ఇష్టపడని అతను తన పదవికి రాజీనామా చేశాడు. హైదరాబాద్ క్రికెట్ ఉన్నత ప్రమాణాలను సాధించడంలో కీలక పాత్ర పోషించిన శ్రీ్ధర్, ఎవరికి అలాంటి సమస్య వచ్చినా వెంటనే స్పందించేవాడు. వ్యక్తిగత కారణాలవల్ల బిసిసిఐ పదవికి రాజీనామా చేసినప్పటికీ, క్రికెట్‌కు సేవలు అందిస్తునే ఉంటాడని ఊహించామని, అతని హఠాన్మరణం హైదరాబాద్ క్రికెట్ సంఘానికేగాక, బిసిసిఐకి కూడా తీరని లోటని పలువురు ప్రముఖులు వ్యాఖ్యానించారు.

చిత్రం.. బిసిసిఐ మాజీ జనరల్ మేనేజర్ శ్రీ్ధర్ (ఫైల్‌పొటో)