క్రీడాభూమి

కొత్త బంతిని సంధించడంలో.. వారే ఉత్తములు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 31: టీమిండియా పేసర్ల ద్వయం భువనేశ్వర్ కుమార్, జస్‌ప్రీత్ బుమ్రాపై న్యూజిలాండ్ డాషింగ్ బ్యాట్స్‌మన్ కొలిన్ మున్రో ప్రశంసల వర్షం కురిపించాడు. భారత ఉపఖండంలోని పిచ్‌లపై కొత్త బంతితో మెరుపులు మెరిపించడంలో ఉత్తమ బౌలర్లు వారేనని అతను కొనియాడాడు. టీమిండియాతో కాన్పూర్‌లో జరిగిన నిర్ణాయక చివరి వనే్డలో మున్రో దూకుడుగా ఆడి అర్థ శతకంతో రాణించిన విషయం విదితమే. అయితే దూకుడుగా ఆడినంత మాత్రాన ఎప్పుడూ పరుగులు రాబట్టుకోవడం సాధ్యం కాదన్న విషయం తనకు తెలుసని అతను చెప్పాడు. బుధవారం నుంచి టీమిండియాతో మూడు మ్యాచ్‌ల ట్వంటీ-20 సిరీస్ ప్రారంభం కానున్న నేపథ్యంలో మున్రో మంగళవారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడుతూ, ‘బ్యాటింగ్‌లో మంచి టెంపోను కొనసాగించడమే నా ముందున్న పెద్ద సవాలు. తొలి పది ఓవర్లలో బ్యాట్ ఝళిపించి ధారాళంగా పరుగులు సాధించాలని నేను కోరుకుంటున్నా. కానీ అలా చేయడం అన్ని వేళలా సాధ్యం కాదు. ప్రత్యేకించి భువనేశ్వర్ కుమార్, జస్‌ప్రీత్ బుమ్రా లాంటి బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొని వేగంగా పరుగులు సాధించడం చాలా కష్టమైన పనే. భారత ఉపఖండంలోని పిచ్‌లపై కొత్త బంతితో మెరుపులు మెరిపించడంలో వారే ఉత్తములు’ అని స్పష్టం చేశాడు.

చిత్రం..కొలిన్ మున్రో