క్రీడాభూమి

నెహ్రాకు ఆఖరాట!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 31: న్యూజిలాండ్‌తో స్వదేశంలో జరిగిన మూడు మ్యాచ్‌ల వనే్డ క్రికెట్ సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకున్న టీమిండియా ఇప్పుడు అదే జట్టుతో మరో మూడు మ్యాచ్‌ల ట్వంటీ-20 సిరీస్‌లో తలపడేందుకు సిద్ధమైంది. న్యూఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా మైదానంలో బుధవారం జరిగే తొలి మ్యాచ్‌తో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. రాత్రి 7 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. గతంలో కివీస్‌తో ఆడిన అన్ని టి-20 మ్యాచ్‌లలోనూ ఓటమిపాలైన భారత జట్టు ఇప్పుడు ఎలాగైనా ప్రత్యర్థులను ఓడించి ప్రతీకారం తీర్చుకోవాలని ఎదురు చూస్తోంది. అయితే బుధవారం జరుగనున్న టీమిండియా వెటరన్ పేసర్ ఆశిష్ నెహ్రా ప్రధాన ఆకర్షణగా నిలువనున్నాడు. అంతర్జాతీయ కెరీర్‌లో అతనికి ఇదే చివరి మ్యాచ్ కావడం ఇందుకు కారణం. 18 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో చాలా కాలం పాటు గాయాలతో సతమతమై టీమిండియాకు పదేపదే దూరమైన ఆటగాడిగా ముద్ర పడిన ఆశిష్ నెహ్రా ఈ మ్యాచ్ ముగిసిన తర్వాత సొంత అభిమానుల సమక్షంలో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికేందుకు సిద్ధమయ్యాడు. కనుక ఈ మ్యాచ్‌లో విజయం సాధించి సిరీస్‌లో శుభారంభాన్ని అందుకోవడంతో ద్వారా ఆశిష్ నెహ్రా (38)కు ఘనంగా వీడ్కోలు పలకాలని టీమిండియా నిశ్చయించుకుంది. అయితే ఇప్పటివరకూ న్యూజిలాండ్‌తో అన్ని టి-20 మ్యాచ్‌లలోనూ భారత జట్టుకు ఓటములే ఎదురయ్యాయి. వీటిలో చివరిదైన ఐదో మ్యాచ్ గత ఏడాది ఐసిసి ప్రపంచ కప్ టి-20 టోర్నమెంట్‌లో జరిగింది. ఈ భారత టోర్నమెంట్‌లో భారత జట్టు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, శ్రీలంక లాటి మేటి జట్లపై విజయాలతో ముందుకు దూసుకెళ్లినప్పటికీ చివరికి కివీస్ చేతిలో మరోసారి ఓటమిపాలై అభిమానులను నిరాశపర్చింది. అయితే పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో ఇటీవల ఆస్ట్రేలియా లాంటి మేటి జట్లను మట్టికరిపించి తన ఆధిపత్యాన్ని చాటుకున్న టీమిండియా కొద్ది రోజుల క్రితం కివీస్‌తో జరిగిన వనే్డ సిరీస్‌లో కూడా విజయభేరి మోగించిన విషయం విదితమే. మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకుని మరింత ఆత్మవిశ్వాసాన్ని నింపుకున్న భారత జట్టు ఇప్పుడు న్యూజిలాండ్‌తో జరిగే టి-20 సిరీస్‌లోనూ అదే జోరు కొనసాగించి పొట్టి ఫార్మాట్‌లో ప్రత్యర్థులపై తన రికార్డును మెరుగుపర్చుకోవాలని తహతహలాడుతోంది.
ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో కొనసాగుతూ అన్ని విభాగాల్లోనూ చక్కగా రాణిస్తున్న భారత జట్టుకే ఈ సిరీస్‌లో విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాన్పూర్‌లో కివీస్‌తో జరిగిన నిర్ణాయక చివరి వనే్డలో సెంచరీతో సత్తా చాటుకోవడంతో పాటు అంతర్జాతీయ వనే్డ క్రికెట్‌లో అత్యంత వేగవంతంగా 9 వేల పరుగుల మైలురాయిని అధిగమించిన ఆటగాడిగా రికార్డు సృష్టించిన కెప్టెన్ విరాట్ కోహ్లీ, మరో సెంచూరియన్ రోహిత్ శర్మ మంచి ఫామ్‌లో కొనసాగుతుండటం భారత జట్టుకు కలిసొచ్చే అంశం. కెప్టెన్, వైస్ కెప్టెన్‌తో పాటు కివీస్‌పై మంచి రికార్డును కలిగివున్న శిఖర్ ధావన్, మహేంద్ర సింగ్ ధోనీ లాంటి ఆటగాళ్లు కూడా భారత జట్టు బ్యాటింగ్ విభాగ బాధ్యతలను తమ భుజాలకు ఎత్తుకోనున్నారు. వీరితో పాటు భారత జట్టుకు మరింత బలాన్ని చేకూరుస్తున్న ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య కివీస్‌కు ఆందోళన కలిగిస్తున్నాడు. అలాగే భువనేశ్వర్ కుమార్, జస్‌ప్రీత్ బుమ్రా, లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహాల్, మరో స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌లతో భారత బౌలింగ్ విభాగం కూడా పటిష్టంగా ఉంది.

చిత్రాలు..మరో సిరీస్‌పై గురిపెట్టిన కోహ్లీ
* 18 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌ను ముగించేందుకు సిద్ధమైన స్పీడ్‌స్టర్ ఆశిష్ నెహ్రా