క్రీడాభూమి

ఆసియా మహిళల హాకీలో భారత్ జోరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కకమిగహరా, అక్టోబర్ 31: ఆసియా కప్ మహిళల హాకీ టోర్నమెంట్‌లో భారత జట్టు క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. చైనాతో జరిగిన గత మ్యాచ్‌లో 1-4 గోల్స్ తేడాతో విజయం సాధించిన భారత జట్టు మంగళవారం ఇక్కడ జరిగిన చివరి పూల్ గేమ్‌లో 2-0 గోల్స్ తేడాతో మలేషియా జట్టును మట్టికరిపించి వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసుకుంది. మ్యాచ్ చివర్లో వందనా కటారియా, గుర్జిత్ కౌర్ చెరో గోల్ సాధించి భారత జట్టుకు ఈ విజయాన్ని అందించారు. దీంతో మొత్తం 9 పాయింట్లతో టేబుల్ టాపర్‌గా నిలిచిన భారత జట్టు క్వార్టర్ ఫైనల్స్‌లో బెర్తును ఖరారు చేసుకుంది. ఆరంభం నుంచే ఎంతో ఆసక్తికరంగా సాగిన ఈ మ్యాచ్‌లో తొలి క్వార్టర్ వరకు ఇరు జట్లు ఎంతో జాగ్రత్తగా ఆడాయి. మలేషియా జట్టు డిఫెన్స్‌కు పరిమితమవడంతో భారత జట్టు ఎటువంటి అనవసర తప్పిదాలకు పాల్పడకుండా ఓపిగ్గా ఎదురు చూసింది. దీంతో తొలి క్వార్టర్‌లో ఇరు జట్లు ఒక్క గోల్‌ను కూడా నమోదు చేయలేదు. రెండో క్వార్టర్ ఆరంభంలో మలేషియా జట్టు పెనాల్టీ కార్నర్‌ను సాధించి భారత జట్టును వెనక్కి నెట్టే ప్రయత్నం చేసింది. అయితే ఆ పెనాల్టీ కార్నర్‌ను భారత గోల్‌కీపర్ రజనీ ఎతిమరుపు సమర్ధవంతంగా ప్రతిఘటించి ప్రత్యర్థుల ఆశలపై నీళ్లు చల్లింది. ఆ తర్వాత భారత జట్టుకు ఒక పెనాల్టీ కార్నర్, మలేషియా జట్టుకు రెండు పెనాల్టీ కార్నర్‌లు లభించినప్పటికీ అవి గోల్స్‌గా మారలేదు. ఆ తర్వాత కూడా ఆట ఇలాగే సాగడంతో ఇరు జట్లు మూడో క్వార్టర్ ముగిసే సమయానికి కూడా గోల్స్‌ను సాధించలేకపోయాయి. దీంతో నాలుగో క్వార్టర్‌లో విజృంభించి ఆడిన భారత జట్టు మ్యాచ్‌ను విజయవంతంగా తమవైపు తిప్పుకోగలిగింది. వందనా కటారియా 54వ నిమిషంలో భారత్‌కు అద్భుతమైన ఫీల్డ్ గోల్‌ను అందించగా, ఆ మరుసటి నిమిషంలో లభించిన పెనాల్టీ కార్నర్‌ను గుర్జిత్ కౌర్ గోల్‌గా మలచి భారత్ ఆధిక్యతను 2-0కు పెంచింది. ఆ తర్వాత గోల్ కోసం విశ్వ ప్రయత్నాలు చేసినప్పటికీ వారిని భారత జట్టు సమర్ధవంతంగా అడ్డుకుని విజయం సాధించింది.