క్రీడాభూమి

కామనె్వల్త్ షూటింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్రిస్బేన్, నవంబర్ 1: ఇక్కడ జరుగుతున్న కామనె్వల్త్ షూటింగ్ పురుషులు, మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్స్‌లో భారత్ స్వర్ణ పతకాలను కైవసం చేసుకుంది. పురుషుల విభాగంలో షాజార్ రిజ్వీ స్వర్ణం సాధించగా, ఓంకార్ సింగ్, జితూ రాయ్ వరుసగా రజత, కాంస్య పతకాలు గెల్చుకోవడం విశేషం. మొదటి మూడు స్థానాలను ఆక్రమించిన భారత్ మహిళల విభాగంలోనూ మొదటి రెండు స్థానాలను సొంతం చేసుకొని ఆధిపత్యాన్ని నిరూపించుకుంది. పూజా ఘట్కర్ స్వర్ణ పతకాన్ని అందుకోగా, ఆమె సహచర షూటర్ అంజుమ్ మోడ్గిల్ రజత పతకాన్ని గెల్చుకుంది.

ఒలింపిక్ క్రీడాజ్యోతితో ఇంచియాన్ వద్ద రిలేలో పాల్గొన్న ఫిగర్ స్కేటర్ యూ యంగ్. 2018 వింటర్ ఒలింపిక్స్‌కు పియోంగ్‌చాంగ్ ఆతిథ్యమిస్తుండగా, వంద రోజుల రిలేను ముగించుకున్న తర్వాత ప్రధాన క్రీడా వేదిక వద్దకు జ్యోతి చేరుకుంటుంది