క్రీడాభూమి

ఆంధ్ర ప్రదేశ్ మంత్రి మండలి అభినందనలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 1: ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల బ్యాడ్మింటన్ సింగిల్స్ టైటిల్ సాధించి ఆంధ్రప్రదేశ్ ఖ్యాతిని, భారతదేశ కీర్తిని ప్రపంచానికి చాటిన తెలుగుతేజం కిడాంబి శ్రీకాంత్‌ను ఆంధ్రప్రదేశ్ మంత్రి మండలి మనస్ఫూర్తిగా అభినందించింది. 40వ ర్యాంకర్ కెంటా నిషిమోటోపై శ్రీకాంత్ విజయం సాధించి తన కెరియర్‌లో ఐదో సూపర్ సిరీస్ టైటిల్ గెలుచుకోవడం దేశానికే గర్వకారణమని పేర్కొంది. ఒకే సీజన్‌లో వరుసగా నాలుగు సూపర్ సిరీస్ టైటిళ్లు గెలుచుకున్న తొలి భారత ఆటగాడిగా శ్రీకాంత్ రికార్డు నమోదు చేయడాన్ని మంత్రి మండలి ప్రశంసించింది. డెన్మార్క్ ఓపెన్ టైటిల్ నెగ్గిన శ్రీకాంత్ వారంరోజుల వ్యవధిలోనే ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ కూడా కైవసం చేసుకోవడం అతని ప్రతిభకు నిదర్శనమని ప్రశంసించింది. 3్భరత బ్యాడ్మింటన్‌లో శ్రీకాంత్ ధృవతారగా ఎదిగారు. ప్రకాశ్ పదుకొనే, పుల్లెల గోపీచంద్, సైనా నెహ్వాల్, పివి సింధు సరసన ఉత్తమ క్రీడాకారుడిగా నిలిచారు. ఈ ఏడాది వివిధ సూపర్ సిరీస్ టోర్నీల్లో 31 మ్యాచ్‌లలో పాల్గొని 27 మ్యాచ్‌లలో విజయం సాధించి తన జైత్రయాత్ర కొనసాగిస్తున్నారు. ఒక్క ఏడాదిలోనే నాలుగు సూపర్ సిరీస్ టైటిళ్లు సాధించడం మరే భారత క్రీడాకారుడికి సాధ్యంకాని ఘనత. ప్రపంచంలో కేవలం ముగ్గురు మాత్రమే అందుకున్న ఇలాంటి అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకోవడం ద్వారా కిదాంబి శ్రీకాంత్ ఆటపై తనకున్న పట్టును చాటారు2 అంటూ మంత్రి మండలి ప్రశంసలు కురిపించింది. ప్రపంచ బ్యాడ్మింటన్‌లోనే అత్యుత్తమ ఆటగాళ్లు లీ చాంగ్ వీ, లిన్ డాన్, చెన్ లాంగ్ సరసన శ్రీకాంత్ నిలవడం యువ క్రీడాకారులకు స్ఫూర్తిదాయకమని పేర్కొంది. కిదాంబి శ్రీకాంత్ భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధించాలని మంత్రి మండలి ఆకాంక్షించింది. శ్రీకాంత్ స్ఫూర్తిదాయక విజయాన్ని అభినందిస్తూ రూ. 2 కోట్ల నగదు బహుమానం అందించాలని, గ్రూప్-1 అధికారి (డిప్యూటీ కలెక్టర్)గా ఉద్యోగం కల్పించాలని, అమరావతిలో వెయ్యి గజాల స్థలం ఇవ్వాలని రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయించింది. అలాగే ఇండియన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్‌కు రూ. 15లక్షలు, ఇంటర్మీడియట్ ఎలైట్ లెవెల్ కోచ్ సుధాకర్‌రెడ్డికి రూ. 11.25 లక్షలు, గ్రాస్‌రూట్ లెవెల్ కోచ్ కె. శ్రీకాంత్‌కు రూ. 3.75 లక్షలు నజరానాలు ఇవ్వాలని మంత్రి మండలి తీర్మానించింది.