క్రీడాభూమి

కోహ్లీకి క్లీన్‌చిట్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 2: మ్యాచ్ జరుగుతున్నప్పుడు వాకీటాకీలో మాట్లాడిన సంఘటనలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) క్లీన్‌చిట్ ఇచ్చింది. న్యూజిలాండ్‌తో బుధవారం మొదటి టి-20 ఇంటర్నేషనల్ జరుగుతున్నప్పుడు, డగౌట్‌లో కూర్చున్న కోహ్లీ వాకీటాకీలో డ్రెస్సింగ్ రూమ్‌లో ఉన్న వారితో మాట్లాడడం కనిపించింది. ఐసిసి నిబంధనల ప్రకారం సెల్‌ఫోన్లలో మాట్లాడడం నిషిద్ధం. అయితే, ఆటగాళ్లు, సపోర్టింగ్ స్ట్ఫా పరస్పరం మాట్లాడుకోవడానికి వాకీటాకీలను అనుమతిస్తారు. కానీ, మ్యాచ్ జరుగుతున్నప్పుడు, డగౌట్‌లో ఉన్నవారు ఎవరూ వాటిని ఉపయోగించరాదు. ఈ నిబంధనను దృష్టిలో ఉంచుకొని, కోస్లీపై ఐసిసి చర్య తీసుకునే అవకాశం ఉందని వార్తలు వెలువడ్డాయి. అయితే, ముందుగానే అతను ఐసిసి ఆధ్వర్యంలోని అవినీతి నిరోధక విభాగం (ఎసియు) నుంచి అనుమతి తీసుకున్నాడని పేరు చెప్పడానికి ఇష్టపడని ఒక అధికారి స్పష్టం చేశాడు. అందుకే, అతనికి ఐసిసి క్లీన్‌చిట్ ఇచ్చిందని తెలిపాడు.