క్రీడాభూమి

దుమ్ము రేపిన సోనియా, నీరజ్ ఆసియా చాంపియన్‌షిప్స్ క్వార్టర్స్‌కు చేరిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హోచిమిన్ సిటీ (వియత్నాం), నవంబర్ 3: వియత్నాంలో జరుగుతున్న ఆసియా బాక్సింగ్ చాంపియన్‌షిప్స్‌లో ప్రపంచ చాంపియన్‌షిప్ రజత పతక విజేత సోనియా లాథర్‌తో పాటు భారత యువ బాక్సర్ నీరజ్ క్వార్టర్ ఫైనల్స్‌కు దూసుకెళ్లారు. ఇదే ఈవెంట్‌లో ఇంకుముందు రజత పతకాన్ని సాధించిన సోనియా లాథర్ (57 కిలోల విభాగం), నీరజ్ (51 కిలోల విభాగం) శుక్రవారం ఇక్కడ జరిగిన మహిళల ప్రీక్వార్టర్ ఫైనల్ బౌట్లలో తమ తమ ప్రత్యర్థులను మట్టికరిపించి సత్తా చాటుకున్నారు. అయితే 81 కిలోల విభాగంలో పూజా రాణి తొలి రౌండ్ నుంచే నిష్క్రమించడం భారత అభిమానులను నిరాశ పర్చింది. నేషన్స్ కప్ టోర్నీలో పసిడి పతకాన్ని సాధించిన నీరజ్ ఆసియా టోర్నీలో పాల్గొనడం ఇదే తొలిసారి. హర్యానాకు చెందిన ఆమె శుక్రవారం ఇక్కడ జరిగిన బౌట్‌లో పవర్‌ఫుల్ పంచ్‌లతో విజృంభించి మయన్మార్‌కు చెందిన నల్లీ నల్లీని మట్టికిరిపించింది. నీరజ్ మంచి పొడగరి కావడం ఈ బౌట్‌లో ఆమెకు బాగా కలసి వచ్చింది. క్వార్టర్ ఫైనల్ బౌట్‌లో నీరజ్ కొరియా బాక్సర్ పాంగ్ చోల్ మితో తలపడనుంది. కాగా, మహిళల 57 కిలోల విభాగంలో జరిగిన ప్రీక్వార్టర్ ఫైనల్ బౌట్‌లో సోనియా లాథర్ జపాన్‌కు చెందిన కురోగి కనాపై విజయం సాధించింది. ఈ బౌట్ రెండో రౌండ్‌లో లాథర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడి పంచ్‌ల వర్షం కురిపించడంతో ప్రత్యర్థి కంటికి గాయమైంది. దీంతో కనా ఇక చేసేది లేక డిఫెన్స్‌కు పరిమితమవడంతో అంతిమంగా ఆమెకు ఓటమి తప్పలేదు. శనివారం జరుగనున్న క్వార్టర్ ఫైనల్ బౌట్‌లో లాథర్ చైనా బాక్సర్ ఇన్ జున్హువాతో తలపడనుంది. అయితే ఆసియా క్రీడల్లో కాంస్య పతకాన్ని సాధించిన పూజా రాణి చైనా బాక్సర్ యాంగ్ జియోలీతో జరిగిన తొలి రౌండ్ బౌట్‌లో ఓటమిపాలై ఈ చాంపియన్‌షిప్స్ నుంచి ఆదిలోనే నిష్క్రమించడం భారత అభిమానులను తీవ్రంగా నిరాశపర్చింది.