క్రీడాభూమి

ప్రపంచ కప్ టోర్నీకి ప్రతిభే ముఖ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కకమిగహరా (జపాన్), నవంబర్ 5: ఆసియా కప్ మహిళల హాకీ టోర్నమెంట్‌లో భారత జట్టు మరోసారి టైటిల్ సాధించడం పట్ల కెప్టెన్ రాణీ రాంపాల్ సంతోషాన్ని వ్యక్తం చేసింది. వచ్చే ఏడాది జరుగనున్న ప్రపంచ కప్ హాకీ టోర్నీలోకి ప్రతిభ ఆధారంగా ప్రవేశించడం తమకు ఎంతో ముఖ్యమని ఆమె పేర్కొంది. ఆదివారం ఇక్కడ జరిగిన ఆసియా కప్ టోర్నీ ఫైనల్‌లో భారత జట్టు పెనాల్టీ షూటౌట్ ద్వారా 5-4 గోల్స్ తేడాతో చైనాను ఓడించిన అనంతరం రాణి విలేఖరులతో మాట్లాడుతూ ఈ విషయాన్ని స్పష్టం చేసింది. ‘ఆసియా కప్‌ను కైవసం చేసుకున్న మేము ప్రతిభ ఆధారంగా ప్రపంచ కప్ టోర్నమెంట్‌కు అర్హత సాధించడం ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది. ఇటువంటి పెద్ద టోర్నమెంట్లలో ఎంతో స్ఫూర్తిని ప్రదర్శించగలిగే యువ క్రీడాకారిణులు మా జట్టులో ఎంతో మంది ఉన్నారు. అందుకే ఫైనల్‌లో మేము చైనాను ఓడించగలిగాం. ఈ మ్యాచ్‌లో చైనా కూడా మాతో సరిసమానంగా ఆడింది. అందుకే ఫలితాన్ని తేల్చేందుకు పెనాల్టీ షూటౌట్‌ను నిర్వహించాల్సి వచ్చింది. ఇది చాలా పెద్ద స్థాయి పోటీ. దీనిని దృష్టిలో ఉంచుకుని మేము ఏ దశలోనూ వెనకడుగు వేయలేదు. చివర్లో గోల్‌కీపర్ సవిత మా జట్టును అద్భుతంగా కాపాడింది. పెనాల్టీ షూటౌట్‌లో నేను కూడా గోల్ సాధించగలిగినందుకు ఎంతో సంతోషిస్తున్నా’ అని రాంపాల్ హర్షాన్ని వ్యక్తం చేసింది. వచ్చే ఏడాది జరుగనున్న కామనె్వల్త్, ఆసియా క్రీడలకు ముందు ఈ టైటిల్ సాధించడం తమకు ఎంతో ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చిందని రాణీ రాంపాల్ పేర్కొంది. ఎప్పుడూ తమకు వెన్నంటి మద్దతు తెలుపుతూ ఉత్తమ క్రీడా వసతులను కల్పిస్తున్న హాకీ ఇండియా (హెచ్‌ఐ), స్పోర్ట్స్ అధారిటీ ఆఫ్ ఇండియాకు ఆమె కృతజ్ఞతలు తెలిపింది. వచ్చే ఏడాది జరిగే కామనె్వల్త్ క్రీడలతో పాటు ఆసియా క్రీడల్లో కూడా ఇదే స్ఫూర్తితో రాణించగలమని ఆశిస్తున్నట్లు ఆమె చెప్పింది. ఇంతకుముందు ఏడేళ్ల క్రితం (2010లో) ప్రపంచ కప్ హాకీ టోర్నమెంట్‌లో ఆడిన భారత మహిళా జట్టు 2014 ఎడిషన్‌కు అర్హత సాధించలేకపోయిన విషయం తెలిసిందే. అయితే ఆదివారం చైనాతో ఫైనల్ పోరులో జరిగిన షూటౌట్ గురించి రాణీ మాట్లాడుతూ, ఉత్కంఠ భరితమైన పరిస్థితులను ఎదుర్కొనేందుకు తాము పూర్తిస్థాయిలో సన్నద్ధమయ్యామని, అందుకే ఈ విజయాన్ని అందుకోగలిగామని స్పష్టం చేసింది. ‘దక్షిణాఫ్రికాలోని జొహానె్నస్‌బర్గ్‌లో జరిగిన వరల్డ్ లీగ్ సెమీ ఫైనల్‌లో మా ప్రదర్శన సంతోషకరంగా లేదు. దీంతో పెద్ద టోర్నమెంట్లలో రాణించేందుకు ఆత్మవిశ్వాసాన్ని నింపుకోవడం ఎంతో అవసరమని మా జట్టు నిశ్చయించుకుంది. అందుకే పెనాల్టీ కార్నర్లను గోల్స్‌గా మలిచేందుకు మేము ఎంతో కసరత్తు చేశాం. ఈ విషయంలో గుర్జీత్ కౌర్ చాలా శ్రమించింది. అలాగే నాకౌట్ మ్యాచ్‌లు పెనాల్టీ షూటౌట్‌లతోనే ముగుస్తాయని ముందుగానే ఊహించిన మేము అటువంటి పరిస్థితులను ఎదుర్కొనేందుకు పూర్తిస్థాయిలో సిద్ధమయ్యాం. ఆ సన్నాహకాలే నేడు మాకు ఈ విజయాన్ని సమకూర్చి పెట్టాయి’ అని రాణి వివరించింది.