క్రీడాభూమి

ప్రపంచ టాప్-10లోకి భారత జట్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లాసానే్న, నవంబర్ 6: ఆసియా కప్ హాకీ టోర్నమెంట్‌లో టైటిల్‌ను కైవసం చేసుకుని మరోసారి చాంపియన్‌గా ఆవిర్భవించిన భారత జట్టు మంగళవారం ప్రకటించిన ప్రపంచ ర్యాంకింగ్స్‌లో టాప్-10లోకి దూసుకెళ్లింది. ఆదివారం జపాన్‌లోని కకమిగహరాలో జరిగిన ఆసియా కప్ ఫైనల్‌లో చైనాను ఓడించిన భారత జట్టు తాజా ర్యాకింగ్స్‌లో రెండు స్థానాలను మెరుగుపర్చుకుని పదో ర్యాంకుకు ఎగబాకింది. ఈ ర్యాంకుల్లో యూరోపియన్ చాంపియన్ నెదర్లాండ్స్ అగ్రస్థానాన్ని, ఇంగ్లాండ్ జట్టు ద్వితీయ స్థానాన్ని, పాన్ అమెరికా చాంపియన్ అర్జెంటీనా తృతీయ స్థానాన్ని నిలబెట్టుకోగా, ఈ ఏడాది ఓషియానా కప్ టోర్నీలో విజేతగా నిలిచిన ఆస్ట్రేలియా నాలుగో స్థానానికి దూసుకెళ్లింది. అలాగే తాజా ర్యాంకింగ్స్‌లో న్యూజిలాండ్ ఐదో స్థానానికి, జర్మనీ ఆరో స్థానానికి ఎగబాకడంతో ఇప్పటివరకూ నాలుగో స్థానంలో నిలిచిన అమెరికా జట్టు ఏడో స్థానానికి పడిపోయింది. ప్రస్తుతం టాప్-10లో అమెరికా తర్వాత కొరియా ఎనిమిదో స్థానంలోనూ, స్పెయిన్ జట్టు తొమ్మిదో స్థానంలోనూ నిలిచాయి.